8, జూన్ 2012, శుక్రవారం

డబ్బు సంపాదించటం ఎలా ?

డబ్బు తొందరగా సంపాదించటం తప్పా ?

4, జూన్ 2012, సోమవారం



రాష్ట్ర జనాభా వివరాలు

Wed, 20 Jul 2011, IST    vv
హైదరాబాద్‌ (వి.వి.) : రాష్ట్ర జనాభా 8,46,65,533కు చేరింది. ఇందులో గ్రామీణ జనాభా 5,63,11,778 (66.51 శాతం), పట్టణ ప్రాంతాల్లో 2,83,53,745 (33.49శాతం)గా వుంది. మొత్తం జనాభాలో 4,25,09, 881 (50.21శాతం) పురుషులు కాగా, 4,21,55,652 (49.79 శాతం) మహిళలు వున్నారు. తాజాగా జరిగిన జనాభా లెక్కలను బట్టి (2011 సెన్సెస్‌) ఈ వివరాలను ఢిల్లీలోని రిజిస్టార్‌ జనరల్‌, సెన్సెస్‌ కమిషనర్‌ ఈనెల 15వ తేదీన విడుదల చేశారు. దానిని రాష్ట్ర ప్రభుత్వం నేడు పత్రికలకు అందించింది. దేశ జనాభా 121.02 కోట్లకు చేరింది. ఇందులో గ్రామీణ జనాభా 83.31 కోట్లు (68.84 శాతం) కాగా, పట్టణ ప్రాంతాల జనాభా 37.71 కోట్లు (31.16 శాతం). రాష్ట్రంలో హైదరాబాద్‌ ఒక్కటే పూర్తిస్థాయి అర్బన్‌ జిల్లాగా ఎదిగింది. అనంతరం అత్యధిక జనాభా గల అర్బన్‌ ప్రాంతంగా రంగారెడ్డి 70.32 శాతంతో వుంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న జనాభా అత్యల్పంగా వుంది. ఈ జిల్లాలో కేవలం 15 శాతం మంది మాత్రమే పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2001లో ప్రతి వెయ్యిమంది పురుషులకు 978 మంది స్త్రీల జనాభా వుండగా, 2011 నాటికి 992కు పెరిగింది. ఆరు సంవత్సరాల లోపు వున్న బాలల సంఖ్య 86,42,686. ఇందులో 58,52,284 మంది గ్రామీణ ప్రాంతాల్లోను, 27,90,402 మంది పట్టణ ప్రాంతాల్లోను వున్నారు. అక్షరాస్యతాశాతం 67.66గా నమోదైంది. ఇందులో గ్రామీణ ప్రాంతాల్లో 61.14 శాతంగాను, పట్టణ ప్రాంతాల్లో 80.54 శాతంగాను వుంది.