1, ఆగస్టు 2014, శుక్రవారం

విదేశీ పెట్టుబడులకు రెడ్‌కార్పెట్లా?

Thu, 31 Jul 2014, IST    vv
యుపిఏ ప్రభుత్వం గత 10 సం||ల కాలంలో అనేక ఆర్ధిక పారిశ్రామిక విధానాలు అనుస రిస్తూ ప్రపంచ బ్యాంకు షరతు లకు తలొగ్గి సరళీకరణ విధానాల అమలు పేరుతో కార్పొరేట్‌ రం గానికి అనేక రాయితీలు కల్పించ డం, దేశప్రజలపై పెనుభారాలు మోపడం, ఈ క్రమంలోనే అనేక అవినీతి, అక్రమాలకు, కుంభకోణాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో మన్మోహన్‌సింగ్‌ కెబినెట్‌లోని ఆరుగురు మంత్రులు రాజీనామాలు చేసి కోర్టుల చుట్టు తిరుగుతున్న నేపథ్యంలో 2014 సాధారణఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎన్డీఎ(బిజెపి) కీలకనేత మోడీి ప్రధానపాత్ర పోషించి దేశంలోని పెట్టుబడిదారీ, కార్పొరేట్‌ వర్గాలు, మితవాద మతోన్మాదశక్తుల సహకారంతో అధికారం చేప ట్టింది. నరేంద్రమోడీ నేతృత్వంలో కేంద్రప్రభుత్వం ఎలా పనిచేస్తుందనేది అందరికీ ఆసక్తి కల్గిస్తున్న అంశం. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిణామాలను పరిశీలించితే నయా ఉదారవాద సంస్కరణల విషయంలో యుపిఏ ప్రభు త్వానికీ, ఏన్డీయే ప్రభుత్వానికీ మధ్య తేడా ఉండబోదని స్పష్టమవుతోంది. పైగా ఈ సంస్కరణలను వేగవంతంగా అమలు చేసేందుకు ముందుకు వెడుతున్నారు.
మోడీ సంస్కరణలు: నూతన సంస్కరణల పేరుతో క్రొత్త ప్రాధాన్యతలను మోడీి ప్రజల ముందుకు తెచ్చారు. అవి ఆర్ధికాభివృద్ధికి ఉన్న ఆటంకాల తొలగింపు, పెట్టుబడులకు అనువైన సంస్కరణలు - అధికార వర్గానికి మరింత స్వేచ్ఛ ప్రోత్సాహం- ప్రజానుకూల ప్రభుత్వాన్ని పాలనను అం దించటం - మంత్రివర్గ శాఖల మధ్య వచ్చే సమస్యలను పరిష్కరించే వ్యవస్థ - ప్రభుత్వ విధానంలో సుస్థిరత కొనసాగింపు - ప్రభుత్వంలో పారదర్శకత - నీరు, రోడ్లు, విద్య, ఆరోగ్యం మరియు మౌళిక సౌకర్యాలకు ప్రాధాన్యత. వీటన్నింటినీ పరిశీలిస్తే కనబడేది. సంస్కరణల ప్రస్తావనే. ప్రధానిగా నరేంద్రమోడీ 60రోజుల పాలనలో ఉదారవాద సంస్కరణలను మరింత వేగవంతంగా ముందుకు తీసు కెళ్తున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా దీన్ని రుజువుచేస్తున్నాయి.
'మాది మాటల ప్రభుత్వం కాదు. చేతల ప్రభుత్వం' అని గట్టిగా చెప్పే మోడీ గారు నిజంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే ప్రయాణ ఛార్జీలను 14.2 శాతం పెంచారు. సరకుల రవాణా ఛార్జీలు 6.5 శాతం పెంచారు. రైల్వేల అభివృద్ధి కోసమే అంటూ సమర్ధించుకోవడం రైల్వే రంగంలో హైస్పీడ్‌ రైలు మార్గాలు, సబర్బన్‌ మార్గాలు, పోర్టులు మరియు గనులకు అనుసంధానం చేసే సరుకు రవాణా మార్గాల్లో విదేశీ పెట్టుబడిని (ఎఫ్‌డిఐ) అనుమ తించాలనే ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఎఫ్‌డిఐలకు రెడ్‌ కార్పెట్లు : తొలి బడ్జెట్‌ ప్రసంగంలో దేశ అభివృద్ధికి పెట్టుబడులు అవసరం అవుతాయనీ, ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టుబడుల పరిమితిని 49శాతానికి పెంచే యోచన ఉన్నదనీ, భారతీయుల నియంత్రణలోనే యాజమాన్య బాద్యతలుంటాయని ఎఫ్‌ఐపిబి రూటులో పెట్టుబడులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. భారత దేశంలో 100నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసి పెట్టుబడిదారీ దేశాలతో సమాన పోటీకి ఎదగాలంటే - పారిశ్రామిక ఉత్పత్తి రంగాలతో పాటు ఫైనాన్సు, రక్షణ, రైల్వే, పెద్ద విమానయాన, నౌకారంగాలలో ఎఫ్‌డిఐలను ప్రోత్సహించాలనీ, అందుకు ప్రస్తుతం ఉన్న విదేశీ పెట్టు బడుల పరిమితిని 26నుంచి 49శాతానికి పెంచుతామని ప్రకటించారు. అలాగే కంపెనీలో యజమాన్య బాధ్యతలు భారతీయుల పరిధిలోనే ఉంటాయి. ఆర్ధిక వ్యవహరాల కెబినెట్‌ కమిటీ ఎఫ్‌డిఐ పరిమితిని 49 శాతానికి పెం చుతూ ఆమోదం తెల్పింది. ఈ కమిటీకి ప్రధాని నరేంద్ర మోడీి అధ్యక్షుడుగా వ్యవహరిస్తారు. డాలర్ల పెట్టుబడుల కొరకు అర్రులు చాచిన యుపిఏ ప్రభుత్వం ఆర్ధిక వ్యవస్థను మెరుగు పరిచే చర్యల పేరుతో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు తలుపులు బార్లా తెరిచింది. ప్రస్తుత ఎన్డీఎ ప్రభుత్వం ఎఫ్‌డిఐలకు రెడ్‌కార్పెట్లు పరుస్తూ స్వాగతిస్తున్నారు. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ రంగంలో ఎఫ్‌డిఐలను అనుమతించడం వలన నిరుద్యోగం పెరిగిపోతుందని గత ప్రభుత్వంలో నియమించిన పరిశ్రమల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. మల్టీ బ్రాండ్‌ రిటైల్‌ చెయిన్‌ను నియంత్రించడానికి తగిన నిబంధనలు లేని కారణంగా చిన్న, మధ్య తరహా చిల్లర వర్తకులపైన, రైతులపైన ఇది ప్రభావం చూపే అవకాశం ఉన్నదని స్టాండింగ్‌ కమిటీ చెప్పింది. రిటైల్‌ సంస్థలను నియంత్రించని పక్షంలో చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు, కిరాణకొట్టు, మండీలు మూత పడి చిల్లర వర్తకుల జీవనాధారం దెబ్బతిని నిరుద్యోగులుగా బజారునపడే పరిస్థితి.
బీమారంగంలో 49శాతానికి విదేశీ పెట్టుబడుల పరిమితి పెంపు: 2000ల సంవత్సరంలోనే ఆనాటి ఎన్‌డిఎ ప్రభు త్వం బీమారంగంలో ప్రవేటు పెట్టుబడులను ఆహ్వా నించింది. ఐఆర్‌డిఎ చట్టం 1999ను అమలు చేయడం ద్వార విదేశీ బీమాకంపెనీలు భారతీయ బీమారంగంలో 26శాతం వరకు పెట్టుబడులు పెట్టవచ్చని సడలింపు ఇచ్చింది. గత యుపిఎలోనే 2008 నుంచి భీమా రంగం లో విదేశీ పెట్టుబడుల పరిమితిని పెంచేందుకు ప్రతిపాద నలు జరుగుతున్నవి. యుపిఎ ప్రభుత్వం ఈ బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉన్న 26శాతం నుండి 49శాతానికి పెంచాలని నిర్ణయిం చింది. అయితే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే వీలు లేకపోయింది. బిజెపితో సహా ఎక్కువ రాజకీయ పార్టీల నిరసనతో బిల్లు ఆమోదం పొందలేదు. బీమారంగంలో ప్రవేశించే విదేశీ కంపెనీలు లేదా విదేశీ పెట్టుబడులు 49 శాతానికి పెంచే టందుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెల్పింది. అయితే ఈ పెట్టుబడులు విదేశీ పెట్టుబడుల ప్రోత్సహక మండలి ద్వారా మాత్రమే రావాల్సి ఉంటుంది. ఇప్పుడు అధికారం లోనికి వచ్చిన ఎన్డీఎ ప్రభుత్వం దీనిని ఆమోదించింది.
ప్రభుత్వరంగ సంస్థల వాటాల విక్రయాలు: నరేంద్రమోడీ ప్రభుత్వహయాంలో ఈసంవత్సరం ప్రభుత్వరంగసంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.58,425కోట్ల లక్ష్యాన్ని ఆర్ధికశాఖ అంచనావేసింది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ఐదుశాతం వాటాలను అక్టోబరులో విక్రయించేందుకు నిర్ణయించారు. అంతకుముందు కోల్‌ ఇండియాలో పదిశాతం వాటాలు విక్రయించాలని నిర్ణ యించారు. ఎంపిక చేసిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి లోను వాటాలను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రాబడులు పెంచాలని యన్‌డిఎ ప్రభుత్వం నిర్ణయించింది. కనీసం 12 ప్రభుత్వ సంస్థల్లో నిర్దేశిత ప్రమాణంలో వాటాలను వియ్రించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే అక్టోబర్‌ నెల నుండి కనీసం నెలకు రెండు ఇషఉ్యల చొప్పున జారీ చేసి విక్రయించాలని - ఈ ఆర్ధిక సం.లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యం రూ.58వేల 425కోట్లు సమకూర్చుకోవాలని ప్రభు త్వం నిర్ణయించింది. గతఏడాది యుపిఎ ప్రభుత్వం పెట్టు బడుల ఉపసంహరణల ద్వారా రూ.25,841కోట్లు మాత్రమే ఆర్జించింది. పెట్టుకున్న వాస్తవలక్ష్యం రూ. 55,814కోట్లు చేరుకోలేదు. అంతకు ముందు సంవత్సరం రూ.25,890 కోట్లు వాటాల విక్రయం ద్వారా గడించింది.
నిజానికి విదేశీ పెట్టుబడుల కోసం ఇంతగా సాష్టాంగ పడే బదులు ఎగుమతులు పెంచుకోవడానికో, దిగుమ తులు తగ్గించుకోవడానికో ఎందుకు అసక్తి చూపడం లేదు? అభివృద్ధి వ్యూహాన్ని ఎందుకు మార్చుకోవడం లేదు? ప్రజాసంక్షేమంతో సంబంధంలేని అభివృద్ధి విధానాలవల్ల విచ్చలవిడి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుంది. ఆహార రంగంలో స్వాలంబన ఏ దేశ సార్వ భౌమత్యానికైనా పునాది. కాని వ్యవసాయ రంగాన్ని సంక్షో భంలోనికి నెట్టడం వలన ఆహార ఉత్పత్తులు కూడా దిగు మతి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఎరువుల వినియో గాన్ని ప్రోత్సహించినప్పుడు, దేశీయంగా ఎరువుల ఉత్పత్తికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వడంలేదు? ఇవన్నీ ప్రశ్నలే! మన ఆర్ధికవ్యవస్థను సరిదిద్దుకోవాలంటే- అందుకు అవసర మైన సాంకేతిక పరిజ్ఞానం, మానవ వనరులు మనకు పుష్కలంగా ఉన్నాయి. వీటిని సక్రమంగా వినియోగించు కునే ఆలోచనలు చేయాల్సి ఉంటుంది. దేశ సార్వభౌమ త్వానికి, స్వయం సమృద్ధికి దేశీయ వనరులను ఉపయో గించుకుని ముందుకు వెళ్ళే ప్రణాళికలు రూపొందించు కోవాలి. విదేశీ పెట్టుబడులకు స్వస్తి పలకాలి. అప్పుడే మనంతట మనంగా అభివృద్ధిని సాధించగలుగుతాం!

కార్మికచట్టాలకు సవరణలు

Fri, 1 Aug 2014, IST    vv
శ్రీ ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
శ్రీ ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే సభ ముందు
శ్రీ ఆక్షేపించిన కార్మికసంఘాలు
న్యూఢిల్లీ : జాతీయస్థాయిలో కార్మికసంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, నరేంద్రమోడీ ప్రభుత్వం పరిశ్రమల యజమానులకు కొమ్ముకాస్తోంది. 'ఓ పేద చారువాలా' ప్రధాని కాకూడదా అని మొసలికన్నీరు కార్చి 'కార్పొరేటు' డబ్బు, ప్రచారపటాటోపంతో గద్దెనెక్కిన ఆయన కార్మిక వ్యతిరేకిని అని ప్రపంచానికి చాట ిచెబుతున్నారు. కార్మికుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా పరిణమించే చట్టసవరణలు తీసుకొ స్తున్నారు. తాజాగా, కేంద్ర మంత్రివర్గం ఫ్యాక్టరీల చట్టం సహా మూడు కార్మిక చట్టాల సవరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మరింత 'ఆచరణీయంగా', కార్మికులకు 'లబ్ధి చేకూరేలా' చట్టాలకు సవరణలు చేస్తున్నామని ప్రభుత్వం నమ్మబలుకుతోంది. కాగా, ఈ కార్మిక చట్టాల సవరణ ప్రతిపాదనలను ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తొమర్‌ గురువారం తెలిపారు. 'కేబినేట్‌ సవరణలకు ఆమోదం తెలిపింది. కార్మికులకు ప్రయోజనాలు చేకూరేలా సవరణలు ఉండబోతున్నాయి. ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే చట్ట సవరణ ప్రతిపాదనలను సభ ముందుంచాలని మేం భావిస్తున్నాం' అని తొమర్‌ చెప్పారు. అప్రెంటీస్‌ యాక్ట్‌-1961 సహా, కార్మిక చట్టాలు (ఆదాయపన్ను మినహాయింపు, కొన్ని సంస్థల నిర్వహణలకు సంబంధించి రిజిస్టర్ల నిర్వహణ)-1988 చట్టం సవరణల ప్రతిపాదనలను బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం ఆమోదించింది. 1948 ఫ్యాక్టరీల చట్టంలో వర్కింగ్‌ ఉమెన్‌ భద్రత, రాత్రివేళల్లో పని తర్వాత వారికి రవాణ సదుపాయం కల్పించడం నిబంధనలను చేర్చించింది. ఈ చట్టంలో కార్మికుల భద్రత మెరుగుపరచడం, ఓవర్‌టైమ్‌ నిబంధనలను రెట్టింపు చేసింది. కొన్నిచోట్ల మూడు నెలల కాలానికి (త్రైమాసికం) ఓవర్‌టైమ్‌ 50గంటలు ఉండగా దానిని 100గంటలకు పెంచింది. మరికొన్నిచోట్ల ప్రజా ప్రయోజనం ఉన్న ఇతర పనుల్లో 75గంటలనుంచి 125గంటలకు పెంచింది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయమంత్రి విష్ణు దేవ్‌ సాయి కూడా దీనిపై మాట్లాడుతూ ఫ్యాక్టరీల చట్టానికి చేసే సవరణలు ప్రస్తుత పారిశ్రామిక రంగం ముఖచిత్రానికి తగినట్లుగా మరింత ఆచరణీయంగా రూపొందిస్తున్నామని తెలిపారు. ఇదిలాఉంటే, కార్మికసంఘాలు ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఆక్షేపించాయి. ఈ చట్ట సవరణ ప్రతిపాదనలు ప్రభుత్వ 'ఏకపక్ష నిర్ణయం' అని ధ్వజమెత్తాయి. వీటి గురించి వార్తాపత్రికల్లో చూసి తెలుసుకున్నాం తప్ప మాకు ఇంతవరకూ ఈ విషయానికి సంబంధించిన ఎటువంటి సమాచారం అందలేదు అని కార్మికసంఘాల నాయకులు వెల్లడించారు.
ఎఐటియుసి కన్నెర్ర-త్వరలో కార్యాచరణ
కేంద్ర మంత్రివర్గం బుధవారం కార్మిక చట్టాలకు సవరణ ప్రతిపాదనలు ఆమోదించడాన్ని ఎఐటియుసి జాతీయ కార్యదర్శివర్గం తీవ్రంగా ఆక్షేపించింది. చిన్న, మధ్యతరహా సంస్థలకు సంబంధించి ఫ్యాక్టరీల చట్టం, అప్రెంటీస్‌ చట్టం, కార్మిక చట్టాల సవరణలను ఆమోదించే ముందు ప్రభుత్వం కేంద్ర కార్మిక సంఘాలను సంప్రదించకపోవడాన్ని కార్యదర్శివర్గం వ్యతిరేకించింది. దీనిపై కార్మికసంఘాలు త్వరలో సమావేశమై, పోరాట కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపింది. ఫ్యాక్టరీల చట్టంలో రాత్రి షిఫ్ట్‌ల్లో పనిచేసే మహిళల ఓవర్‌టైమ్‌ గంటలను 50నుంచి 100కి పెంచడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.చిన్న, మధ్యతరహా సంస్థలలు ఆదాయపన్ను వివరాలు పంపించడం, రిజిస్టర్ల నిర్వహణకు ఎఐటియుసి వ్యతిరేకం కాదన్నారు. అయితే, ఆదాయవివరాలు, రిజిస్టర్ల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం చేర్చిన సవరణలు పరిశ్రమల యజమానులకు మేలు చేకూరేలా ఉన్నాయని ఎఐటియుసి మండిపడింది. గతంలో 10మంది కార్మికులు ఉంటే రిజిస్టర్‌ నిర్వహించాల్సిన పరిశ్రమలకు నిర్దేశిత పరిధిని 40మంది కార్మికులకు పెంచడం శోచనీయమన్నారు. ఉద్యోగుల నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమల యాజమాన్యాల పర్యవేక్షణను సవరణల్లో చేర్చకపోవడాన్ని ఎఐటియుసి కార్యదర్శివర్గం ఆక్షేపించింది.పారిశ్రామిక వివాదాల చట్టం, కాంట్రాక్ట్‌ లేబర్‌ (క్రమబద్ధీకరణ-రద్దు) చట్టం, కనీసవేతనాల చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు అనుకూల సవరణలు చేయకపోవడంపై ఎఐటియుసి మండిపడింది. రాజస్థాన్‌ ప్రభుత్వం కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించడం, తొలగించే సవరణలను ఎఐటియుసి ఇప్పటికే ఆక్షేపించిన విషయాన్ని గుర్తుచేసింది. పనిచేసే ప్రాంతాల్లో సంస్థలు భద్రతను విస్మరించడం, శాశ్వత ఉద్యోగాల్లో కాంట్రాక్ట్‌ కార్మికులను నియమించి ఇష్టారాజ్యంగా తొలగించడం పట్ల ఎఐటియుసి అభ్యంతరం తెలిపింది.