31, అక్టోబర్ 2017, మంగళవారం

కే ఏ పాల్

మే 21, 2012: నాదేవుడు, నా వెంటే ఉంటాడు, నా వెనుకాలే తిరుగుతాడు, నాతో పెట్టుకుంటే సర్వ నాశనం అయిపోతారు ఇలా ఆడవారిలా డైలాగులు చెప్పే క్రైస్తవ మతస్థుడు కే ఏ పాలు.
వీడు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు పడ్డ గొప్ప మతబోధకుడు. తాజాగా ప్రజా శాంతి పార్టీ ని స్థాపించి ఎన్నికల రంగంలో తన అభ్యర్ధులను కూడా నిలబెట్టాడు. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాడు, అనేక అంతర్జాతీయ సంస్థలతో సంభంధాలు కల వ్యక్తి.
తాజాగా రెండు రోజులక్రితం పాల్ ను అరెస్టు చేశారు ఒంగోలు పోలీసులు. దీనివెనుక అసలు కారణం ఏమిటంటే..
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం కే ఏ పాల్ తమ్ముడు డేవిడ్ రాజు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ సందర్భంగా పోలీసులు డేవిడ్ హత్య చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. డేవిడ్ ను చంపిన వారిలో స్వయంగా డేవిడ్ కొడుకు కూడా ఉన్నాడు.
అందరూ అప్పట్లో డేవిడ్ హత్య వెనుక కే ఏ పాల్ పాత్ర ఉందని భావించినా తగిన ఆధారాలు దొరక లేదు. ఇక 2012 ఇప్పటి అరెస్టు విషయానికి వస్తే … ఒంగోలు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన పాల్ రెండు రోజుల క్రితం తనను ఎవరో అనుకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పాల్. ఈ ఫిర్యాదు పై అత్యంత గోప్యంగా పరిశోధన చేసిన పోలీసులు పాల్ ను అనుసరిస్తున్న కోటేశ్వరరావు, మరొక వ్యక్తిని అరెస్టు చేశారు.
ఆ ఇద్దరి వద్దనుంచి కొన్ని సి‌డి లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సి‌డి లలో సంభాషణ విన్న పోలీసులు దిగ్భ్రాంతి కలిగింది. అందులో పాల్ స్వయంగా తన తమ్ముడు డేవిడ్ పాల్ హత్య గురించి ఇతరులతో ప్లాన్ వేస్తున్న సంభాషణ రికార్డ్ అయ్యిఉంది.
దీనిని పోలీసులు విని పాల్ ను అరెస్టు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పాల్ ఏకంగా ఒంగోలు పోలీసు సి‌ఐ కి కోటి రూపాయలు లంచం ఇస్తానని, కోటేశ్వరరావు మరో వ్యక్తి ని చంపేయండని అన్నాడు. మీరు చంపలేక పోతే ఊరి బయట నా మనుషులు ఉంటారని వారికి వీరిద్దరిని అప్పగించమని కోరాడు. ఇందు మేరకు పోలీసులకు 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు పాల్. దీనినంతా పోలీసులు కేమారాలో చిత్రీకరించారు.
ఇక అరెస్టయిన తరువాత ఇదంగా జగన్, కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలో భాగం అని పాల్ వాదిస్తున్నాడు.
ప్రజా శాంతి పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతానని చెప్పిన క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్ జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది. గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లాలోని పత్తిపాడు, మాచర్ల శానససభా నియోజకవర్గాలకు ఆయన సోమవారం అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది. ఇందుకు గుంటూరులో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ స్థితిలో ఆయన పోలీసులకు చిక్కారు.

తమ్ముడు డేవిడ్ రాజు హత్య జరిగి రెండేళ్లయిన తర్వాత పాల్ ఎలా పోలీసులకు చిక్కాడనేది, ఆయనపై పోలీసులకు ఎలా సాక్ష్యాలు దొరికాయనేది ఆసక్తికరంగా మరింది. డేవిడ్ రాజు హత్య కేసులో కెఎ పాల్ సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం తెల్లవారు జామున ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయనకు రిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఇంటి వద్ద మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. ఆయనకు జిల్లా న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.

కెఎ పాల్‌ది విజయనగరం జిల్లా నెల్లమర్ల మండలం సారిపల్లి గ్రామం. డేవిడ్ రాజుకు, పాల్‌కు మధ్య భోగాపురంలోని గీంసిటీకి సంబంధించిన వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. డేవిడ్ రాజు కుమారుడు సాల్మన్ రాజు ప్రేమ వివాహం కూడా ఓ కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. సాల్మన్ రాజు ప్రేమ వివాహాన్ని డేవిడ్ రాజు వ్యతిరేకించారని అంటారు. డేవిడ్ రాజుతో మిగతా కొంత మంది కలిసి హైదరాబాదులోని అమీర్‌పేటలో గల వైట్‌హౌస్ లాడ్జిలో ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు సమావేశమయ్యారని తెలుస్తోంది.

వైట్ హౌస్‌ నుంచి డేవిడ్ రాజు కారులో బయలుదేరినట్లు తెలిసింది. అతనితో పాటు ఉన్నవారు మార్గమధ్యంలో ఆయనను హత్య చేసి మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామం వద్ద కారులో అతన్ని వదిలేసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు 2010 ఫిబ్రవరిలో 8 మందిని అరెస్టు చేశారు. డేవిడ్ రాజు హత్య కేసులో కోటేశ్వర రావు అనే వ్యక్తి కూడా నిందితుడని చెబుతున్నారు. కోటేశ్వర రావు ఇటీవలి కాలంలో పాల్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడని అంటున్నారు.

కోటేశ్వర రావుపై కెఎ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడ్ని ప్రశ్నించడంతో డేవిడ్ రాజు హత్యలో పాల్ ప్రమేయం బయటపడిందని చెబుతున్నారు. డేవిడ్ రాజు హత్యలో తన ప్రమేయాన్ని కోటేశ్వర రావు అంగీకరిస్తూ అన్ని విషయాలు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పాల్‌ను అరెస్టు చేశారని అంటున్నారు. పాల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని కోటేశ్వర రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కోటేశ్వర రావు ద్వారానే పాల్ పట్టుబడినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్‌ల అవినీతి కార్యకలాపాలను త్వరలోనే తాను బయటపెడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, సువార్త ప్రచారకుడు కిలారి ఆనంద్ పాల్(కెఏ పాల్) ఆదివారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విలేకరులతో మాట్లాడారు.

జగన్, అనిల్ కుమార్‌లు తనను ఎలా ఇబ్బంది పెట్టారో, ఎంతలా ఇబ్బందులకు గురి చేశారో త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. తనకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని వారు కలిగించారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతిదారుణమైనదిగా అభివర్ణించారు. ఆయన హయాంలో తనకు జరిగిన అన్యాయం ఆషామాషీ కాదన్నారు.

2007లో వైయస్‌కు లంచం ఇవ్వకపోవడం వల్లనే తనపై కక్ష పెంచుకొని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అయిదు స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. నరసాపురం, రామచంద్రాపురం, పాయకరావుపేట, ప్రత్తిపాడు, ఒంగోలు స్థానాల నుండి అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు.

కాగా ఒంగోలులో సమావేశం పెట్టవద్దని జగన్ పార్టీ నేత నుండి బెదిరింపులు వస్తున్నాయని ఆయన గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాము ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. ఒంగోలు సభను అడ్డుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుండి బెదిరింపులు వస్తున్నాయని, ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని చెప్పారు. మీటింగ్ అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు.

అవినీతికి పాల్పడిన వారు జైలు పాలవడం ఖాయమని కెఏ పాల్ అంతకుముందు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకు పోయినట్లుగా కనిపిస్తోందన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో తమ ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.

త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టే విషయంపై పార్టీలో చర్చిస్తున్నామని అప్పుడు చెప్పారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు.

2, జులై 2016, శనివారం

అఖిల భారత బ్యాంకులు

యుఎఫ్‌బియు వెల్లడి
ఇండియా న్యూస్‌నెట్‌వర్క్‌ - కొల్‌కతా
                 వేతన సవరణకు సంబంధించిన తమ డిమాండ్ల విషయంలో ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నందుకు నిరసనగా జనవరి 7న అఖిల భారత బ్యాంకులు ఒక రోజు సమ్మె పాటించాలని, జనవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల సమ్మె సాగించాలని యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంకు యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) పిలుపు నిచ్చింది. అప్పటికీ సమస్య పరిష్కారం కాకుంటే మార్చి 16 నుంచి అఖిల భారత బ్యాంకుల సమ్మె నిరవధికంగా కొనసాగుతుందని హెచ్చరించింది. ఈమేరకు బ్యాంకు ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌ బిస్వాస్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. నవంబరు 12న అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సమ్మె , డిసెంబరు 2 నుంచి 5 వరకు జోనల్‌ సమ్మెల తరువాత ఇదివరకు వాయిదా పడిన చర్చలు మళ్లీ బుధవారం ముంబయి లోని డిప్యూటీ ఛీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం వద్ద జరిగాయి.
తమ డిమాండ్లకు సంబంధించి ఇదివరకు జరిగిన చర్చల సారాంశాన్ని వివరిస్తూ డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌కు యుఎఫ్‌బియు లేఖ సమర్పించింది. వేతనం పెంపునకు సంబంధించి తమ డిమాండ్‌ 35 నుంచి 23 శాతానికి తగ్గించుకున్నా ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబిఎ) ఏమాత్రం తన 11 శాతం వైఖరి నుంచి ఒక అడుగు ముందుకు వేయలేదని లేఖలో యుఎఫ్‌బియు ఆరోపించింది. 11 శాతం కన్నా వేతనం పెంపుదలకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని కేవలం మాటలు చెబుతోందని విమర్శించింది. వేతన సవరణ సమస్య గత రెండేళ్లకు పైగా అపరిష్కృతంగా ఉంటోందని, ఐబిఎ ఎలాంటి బాధ్యత వహించక పోవడంతో ఇక తమ ఆందోళన తీవ్రం చేయడం తప్ప వేరే దారి తమకు కనిపించడం లేదని యుఎఫ్‌బియు పేర్కొంది. యుఎఫ్‌బియు ఆధ్వర్యాన జరిగిన సమావేశంలో సమైక్య చర్చలు జరిగాయి. ఈ సమావేశాల్లో రమేష్‌ బాబు, జిఎంవి నాయక్‌ పాల్గొన్నారు. డిమాండ్ల విషయంలో నిర్లక్ష్య వైఖరికి వారు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. ఆందోళన పరంగానే ఐబిఎను కలుసుకోవాలని నమావేశం నిర్ణయించింది. ఈమేరకు సమ్మెలను జయప్రదం చేసేందుకు ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, వ్యవస్థాపరమైన ఏర్పాట్లు చేయాలని సూచించింది

.6 నుంచి బొగ్గుగని కార్మికుల సమ్మె
Posted on: Fri 19 Dec 01:24:14.644953 2014


- సిఐటియు సంపూర్ణ మద్దతు
(ఇండియాన్యూస్‌ నెట్‌వర్కు)
                               న్యూఢిల్లీ : బొగ్గు గనుల విజాతీయీకరణ, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనవరి 6 నుంచి ఐదు రోజుల పాటు సమ్మె చేయాలని రాంచీలో జరిగిన నాలుగు కోల్‌వర్కర్స్‌ ఫెడరేషన్ల సంయుక్త సమావేశం తీసుకున్న నిర్ణయానికి సిఐటియు సంపూర్ణ మద్దతు తెలియచేసింది. ఆర్డినెన్సు, బిల్లు ద్వారా బొగ్గుగని క్షేత్రాలను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, బిఎంఎస్‌, ఎఐటియుసి లకు చెందిన ఫెడరేషన్లు సమ్మె చేయడానికి నిర్ణయించాయి. అలాగే జనవరి 13న దేశ వ్యాప్తంగా సమ్మె చేయడానికి సిఐటియు అనుబంధ ఆల్‌ ఇండియా కోల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ నిర్ణయించడాన్ని సిఐటియు స్వాగతించింది. బొగ్గు పరిశ్రమ లోని ముఖ్యమైన ఫెడరేషన్లు నవంబరు 24న సమ్మెకు సమష్టిగా పిలుపు ఇచ్చినా కార్యరూపం దాల్చకపోవడం శోచనీయం. ఫలితంగా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో కోల్‌మైన్స్‌ బిల్లును ప్రవేశ పెట్టడానికి అవకాశం ఏర్పడింది. ప్రైవేట్‌ రంగానికి వాణిజ్య అవసరాలకు ఇతర ప్రయోజనాలకు బొగ్గుగనులు ధారాదత్తం చేయడానికి, కోల్‌ ఇండియాలో పెట్టుబడులు ఉపసంహరించుకోడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తోంది. లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశ పెట్టారు.
                                 రాజ్యసభ ఆమోదం కోసం నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబరు 24న బొగ్గు పరిశ్రమలో రెండు గంటల పాటు ఎఐసిడబ్ల్యుఎఫ్‌ (సిఐటియు) సమ్మె నిర్వహించింది. అదే సమయంలో బొగ్గుగనుల ప్రాంతాల్లో మానవహారాలు, రోడ్డు దిగ్బంధాలు తదితర ఆందోళనలు దేశ వ్యాప్తంగా సాగాయి. జనవరి 13న కూడా ఎఐసిడబ్ల్యుఎఫ్‌ (సిఐటియు) బొగ్గు పరిశ్రమలో సమ్మె నిర్వహించడానికి నిర్ణయించింది. ఈమేరకు సమ్మె కోసం ఫెడరేషన్‌ ముమ్మరంగా ప్రచారం సాగిస్తోంది. ఈ పరిస్థితిలో ఇతర నాలుగు ఫెడరేషన్లు జనవరి 6 నుంచి ఐదు రోజుల పాటు సమ్మె సాగించడానికి నిర్ణయించడం నిజంగా స్వాగతించదగ్గ విషయం. దేశం మొత్తం మీద బొగ్గుగనుల స్థాయి నుంచి సమష్టిగా ట్రేడ్‌యూనియన్లు సమ్మె సాగించి తప్పనిసరిగా ప్రభుత్వ నిర్ణయం వీగి పోయేలా చేయాలని సిఐటియు పిలుపునిస్తోంది. బొగ్గు గని కార్మికుల పోరాటం మరింత బలోపేతం కావడానికి మరింత విస్తరించడానికి ఈ సమ్మె సుదీర్ఘంగా కొనసాగుతుంది. బొగ్గుగని కార్మిక సంఘాలు ఏవేవీ అన్నది పట్టించుకోకుండా సమష్టిగా సమ్మెను జయప్రదం చేయడానికి ఉధృతంగా ముందుకు సాగాలని సిఐటియు పిలుపునిచ్చింది. డిసెంబరు నుంచి ఈ సమ్మె ప్రచారంలో ఉన్న తమ అనుబంధ సంఘాలు తమ శక్తిసామర్ధ్యాలు రెట్టింపు చేసి ప్రతి బొగ్గుకార్మికునికి , సామాన్య ప్రజానీకానికి సమ్మె పిలుపు అందేలా విస్తృతంగా ప్రచారం సాగించాలని సిఐటియు కోరింది. బొగ్గు పరిశ్రమను సంరక్షించడానికి కార్మికులు చేపట్టిన ఈ సమ్మెకు కార్మిక సంఘాలన్నీ తమ పూర్తి మద్దతు అందించాలని సిఐటియు కోరింది.
న్యూఢిల్లీ :(ఇండియా న్యూస్‌ నెట్‌వర్కు) కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన రవాణా బిల్లుకు నిరసనగా ఆ రంగానికి చెందిన వేలాదిమంది కార్మికులు గురువారం నాడు న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. కార్మికసంఘాలు సంయుక్తంగా ఇచ్చిన ధర్నా పిలుపునకు దేశవ్యాప్తంగా వేలాదిమంది కార్మికులు స్పందించారు. పెద్ద సంఖ్యలో దేశ రాజధానికి తరలి వచ్చారు. 'రోడ్డు రవాణా-భద్రతా బిల్లు 2014'ను ఉపసంహరించుకోవాలంటూ వీరిచ్చిన నినాదాలతో జంతర్‌ మంతర్‌ ప్రాంతం మారుమ్రోగింది. ప్రభుత్వం స్పందించ కుంటే మార్చి మొదటి వారంలో సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు. 'నేడు ధర్నా ... మార్చిలో సమ్మె' అంటూ వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎఐఆర్‌టిబ్య్లుఎఫ్‌ ప్రధాన కార్యదర్శి కెకె దివాకరన్‌ మాట్లాడుతూ రవాణా రంగాన్ని కార్పొరేటీకరణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ ప్రయత్నాలను కార్మికులు ముందుకు సాగనివ్వరని హెచ్చరించారు. ఈ బిల్లుతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న రోడ్డు రవాణా సంస్థలు (ఆర్‌టిసీలు) మూత పడాల్సి వస్తుందని, ఫలితంగా లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు. 7.5 లక్షల మంది ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. ఆర్టీసిలనే కాకుండా సరుకుల రవాణారంగాన్ని, ఆటో,ట్యాక్సిలను కూడా ప్రభుత్వం కార్పొరేటీకరించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అన్నారు. అదే జరిగితే ప్రజానీకంపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు. బిల్లు ఆచరణలోకి వస్తే డ్రైవర్లందరూ జైలులో, వాహనాలు రోడ్ల మీద ఉండే పరిస్థితి ఉంటుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మట్‌ ధరించకపోతే 5వేల రూపాయల ఫైన్‌ విధించే అవకాశం ఉందని చెప్పారు. రోడ్డు ప్రమాదాల్లో డ్రైవర్లకు 7 సంవత్సరాల జైలు శిక్షతోపాటు, 3 లక్షల రూపాయల పెనాల్టీని విధిస్తారని తెలిపారు. వివిధ దేశాల్లో ఉన్న బిల్లులోని అంశాలను కాపీ చేసి తాజా బిల్లును రూపొందించారని, భారత దేశంలోని రోడ్ల పరిస్థితులను, మౌలికవనరులను, ప్రజల అవగాహనస్థితిని పరిగణలోకి తీసుకోలేదని చెప్పారు. మొదటి తప్పుకు విధించే పెనాల్టీ డ్రైవర్ల రెండు నెలల జీతాలకు సమానంగా ఉందని, ఈ పరిస్థితుల్లో భవిష్యత్తులో డ్రైవర్లగా పనిచేయడానికి ఎవ్వరూ ముందుకు రారని ఆయన అన్నారు. అనంతరం జనవరి 15వ తేది నుండి 31 వ తేదిలోగా అన్ని రాష్ట్రాల్లోనూ నిరసన ప్రదర్శనలు చేయాలని తీర్మానించారు. అనంతరం అధికారులను కలిసి వినతిపత్రం అందచేశారు. ఎఐఆర్‌టిడబ్య్లుఎఫ్‌, బిఎంఎస్‌, ఐఎన్‌టియుసి, హెచ్‌ఎం ఎస్‌,ఎన్‌ఎఫ్‌ఐఆర్‌టిబ్ల్యు, యుపిఆర్‌కె ఎస్‌పి, హెచ్‌ఆర్‌కె ఎస్‌పి, ఎఐసిసిటియు, ఎల్‌పిఎఫ్‌ల పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమం జరిగింది.
ఏప్రిల్‌లో చలో పార్లమెంట్‌Posted on: Sat 13 Dec 2014
- సర్కార్‌ దిగిరాకపోతే నిరవధిక సమ్మె
- కేంద్ర ఉద్యోగుల నిర్ణయం
- డిమాండ్లను వెల్లడించిన
జాతీయ ఉమ్మడి కార్యాచరణ మండలి

న్యూఢిల్లీ; రైల్వే, రక్షణశాఖలతో కలిపి అన్ని కేంద్ర ప్రభుత్వోద్యోగ సంఘాల ఉమ్మడి కార్యాచరణ మండలి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారంనాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.న్యూఢిల్లీలో జరిగిన ఉమ్మడి సంప్రదింపుల యంత్రాంగం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు అందరూ కలిసి మూకుమ్మడిగా నిరవధిక సమ్మెకు పూనుకోవడం గత యాభైఏళల్లో ఇదే తొలిసారి. 1960, జూన్‌లో ఒక సారి ఈ విధమైన నిరవధిక సమ్మె చేశారు. 1957లో జరిగిన 15వ భారత కార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాల మేరకు కనీస వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు.
1968లో ఒక రోజు సమ్మె, 1974లో మళ్లీ రైల్వే ఉద్యోగు లు ఇతరులు చేసిన సమ్మె అనంతరం ఉద్యోగ సంఘాలు జెసిఎమ్‌ ద్వారా శాంతియుతంగా తమ కోర్కెలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇతర భారత ఉద్యోగ కార్మిక వర్గాల్లో వీరే ముందున్నారు. ఏన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఇతర డిమాండ్లతో సమ్మె ప్రకటనను విడుదల చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో 800కి పైగా ఉద్యోగ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.రైౖల్వేకి సంబంధించిన రెండు ఉద్యోగ సంఘాలు (ఆల్‌ ఇండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వే మెన్‌), రక్షణ శాఖ ఉద్యోగ సంఘాలు రెండు (ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, ఇండియన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌), పోస్టల్‌ శాఖకు చెందిన రెండు సంఘాలు (నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌, నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌)లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, కార్మికుల సమాఖ్య ఇంకా ఎన్నో ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్యోగుల డిమాండ్లివే
2011లో చేపట్టాల్సిన వేతన సవరింపులు ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. సవరించిన వేతనాలను ఉద్యోగులకు ఈ సంవత్సరం జనవరి నుండి లెక్కించి చెల్లించాలి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు, ప్రైవేటీకరణ లాంటి విధానాలకు స్వస్తి చెప్పాలి. రోజువారీ, క్యాజువల్‌, కాంట్రాక్టు తదితర ఉద్యోగులను క్రమబద్ధీకరిం చాలి. బోనస్‌లపై విధించిన పరిమితులు తొలగించాలి. సర్వీస్‌ కాలంలో ఐదు ప్రమోషన్లను తప్పనిసరి చేయాలి.
డిఎని వేతనంలో కలపాలి. వేతన సంఘం డిఎపై ప్రకటన చేసినా ప్రభుత్వం దాన్ని విడుదల చేయటం లేదు. అలాగే మధ్యంతర సహాయంపై ప్రభుత్వం వ్యతిరేక వైఖరిని విడనాడాలి.
గ్రామీణ డాక్‌ సేవక్స్‌ని ఏడవ వేతన సంఘం పరిధిలోకి తేవాలి. ఇంతకుముందు ఈ డిమాండ్‌ తిరస్కరణకు గురయింది. నూతన ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించింది. దాన్ని ఎత్తేయాలి. రైల్వేలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం, రైల్వేని ప్రయివేటీకరించడం, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతానికి పెంచటం, ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లు, పబ్లికేషన్లు, స్టేషనరీ, దరఖాస్తుల కార్యాలయాలు, మెడికల్‌ స్టోర్లు మొదలైన వాటి మూసివేత, పోస్టల్‌ శాఖను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం, కార్మిక చట్టాల్లో వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్పులు చేయటం లాంటి అనేక కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి.
ప్రకటనలో పేర్కొన్న పది అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలో భాగంగా పలు నిరసన కార్యక్రమాలను వరుసగా చేపట్టాలని, చివరగా నిరవధిక సమ్మెబాట పట్టాలని సమావేశం నిర్ణయించింది.
కార్యాచరణ ఇలా...
డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉమ్మడి సదస్సులు నిర్వహించడం ద్వారా ఫిబ్రవరి 2015కి ముందే ఈ ప్రకటనలోని అంశాలపై అందరికీ అవగాహన కల్పించడం
అన్ని రాష్ట్ర రాజధానుల్లో లేదా ప్రధాన రక్షణ కేంద్రాలున్న ప్రాంతాల్లో మార్చి 2015లో ధర్నాలు లేదా ర్యాలీలు నిర్వహించడం. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు
2015, ఏప్రిల్‌నెల మొదటి రెండువారాల్లో పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాల నిర్వహణ
ఏప్రిల్‌నెలలో బడ్జెట్‌ సమావేశాలు జరిగే సమయంలో పార్లమెంటు ముందు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ ర్యాలీలో నిరవధిక సమ్మెను ఎప్పటినుండి మొదలుపెట్టాలి, దాని తాలూకూ కార్యక్రమాల వివరాలు, సమ్మె నోటీసుని ఇవ్వాల్సిన తేదీని ఖరారు చేయటం


తమిళనాడు మత్స్యకార్మికుల నిరవధిక సమ్మె
Posted on: Thu 18 Dec 00:06:54.318284 2014

                  రామేశ్వరం : శ్రీలంక నేవీ అరెస్టు చేసిన మత్స్యకార్మికులను విడిపించాలని కోరుతూ స్థానిక మత్స్యకార్మికులు, పొరుగు జిల్లాల మత్స్యకార్మికులు బుధవారం నిరవధిక సమ్మెను ప్రారంభించారు. రామనాధపురం, నాగపట్ట ణం, పుదుక్కొట్టయి జిల్లాల నుంచే కాకుండా, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి లోని కరైకాల్‌ నుంచి కూడా మత్స్యకార్మికులు ఈ ఆందోళనలో పాలుపంచుకు న్నట్టు తమిళనాడు, పుదుచ్చేరి మత్స్యకార్మికుల సంఘ కార్యదర్శి ఎన్‌జె బోస్‌ చెప్పారు. రామేశ్వరం చుట్టు పక్కల ప్రాంతాల్లో దాదాపు వెయ్యి మెకనైజ్డు బోట్లు వేటకు వెళ్లకుండా ఒడ్డునే ఉండిపోయాయి. అరెస్టయిన మత్స్యకార్మికులను శ్రీలంక నుంచి విడిపించడంతోపాటు, సముద్రంలో గత కొన్నేళ్లుగా చేపల వేట సాగుతున్న ప్రాంతాల్లో చేపలను వేటాడుకునే వీలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మత్స్యకార్మికులు కోరుతున్నారు.

ఏప్రిల్‌లో చలో పార్లమెంట్‌Posted on: Sat 13 Dec 2014
- సర్కార్‌ దిగిరాకపోతే నిరవధిక సమ్మె
- కేంద్ర ఉద్యోగుల నిర్ణయం
- డిమాండ్లను వెల్లడించిన
జాతీయ ఉమ్మడి కార్యాచరణ మండలి

న్యూఢిల్లీ; రైల్వే, రక్షణశాఖలతో కలిపి అన్ని కేంద్ర ప్రభుత్వోద్యోగ సంఘాల ఉమ్మడి కార్యాచరణ మండలి నిరవధిక సమ్మెకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారంనాడు ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.న్యూఢిల్లీలో జరిగిన ఉమ్మడి సంప్రదింపుల యంత్రాంగం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు అందరూ కలిసి మూకుమ్మడిగా నిరవధిక సమ్మెకు పూనుకోవడం గత యాభైఏళల్లో ఇదే తొలిసారి. 1960, జూన్‌లో ఒక సారి ఈ విధమైన నిరవధిక సమ్మె చేశారు. 1957లో జరిగిన 15వ భారత కార్మిక సదస్సులో తీసుకున్న నిర్ణయాల మేరకు కనీస వేతనాలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు.
1968లో ఒక రోజు సమ్మె, 1974లో మళ్లీ రైల్వే ఉద్యోగు లు ఇతరులు చేసిన సమ్మె అనంతరం ఉద్యోగ సంఘాలు జెసిఎమ్‌ ద్వారా శాంతియుతంగా తమ కోర్కెలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నించాయి. గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ నయా ఉదారవాద ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఇతర భారత ఉద్యోగ కార్మిక వర్గాల్లో వీరే ముందున్నారు. ఏన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోకుండా మిగిలిపోయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, ఇతర డిమాండ్లతో సమ్మె ప్రకటనను విడుదల చేశారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో 800కి పైగా ఉద్యోగ కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.రైౖల్వేకి సంబంధించిన రెండు ఉద్యోగ సంఘాలు (ఆల్‌ ఇండియా రైల్వేమెన్స్‌ ఫెడరేషన్‌, నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వే మెన్‌), రక్షణ శాఖ ఉద్యోగ సంఘాలు రెండు (ఆల్‌ ఇండియా డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌, ఇండియన్‌ నేషనల్‌ డిఫెన్స్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌), పోస్టల్‌ శాఖకు చెందిన రెండు సంఘాలు (నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌, నేషనల్‌ యూనియన్‌ ఆఫ్‌ పోస్టల్‌ ఎంప్లాయీస్‌)లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల, కార్మికుల సమాఖ్య ఇంకా ఎన్నో ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఉద్యోగుల డిమాండ్లివే
2011లో చేపట్టాల్సిన వేతన సవరింపులు ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. సవరించిన వేతనాలను ఉద్యోగులకు ఈ సంవత్సరం జనవరి నుండి లెక్కించి చెల్లించాలి.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు, ప్రైవేటీకరణ లాంటి విధానాలకు స్వస్తి చెప్పాలి. రోజువారీ, క్యాజువల్‌, కాంట్రాక్టు తదితర ఉద్యోగులను క్రమబద్ధీకరిం చాలి. బోనస్‌లపై విధించిన పరిమితులు తొలగించాలి. సర్వీస్‌ కాలంలో ఐదు ప్రమోషన్లను తప్పనిసరి చేయాలి.
డిఎని వేతనంలో కలపాలి. వేతన సంఘం డిఎపై ప్రకటన చేసినా ప్రభుత్వం దాన్ని విడుదల చేయటం లేదు. అలాగే మధ్యంతర సహాయంపై ప్రభుత్వం వ్యతిరేక వైఖరిని విడనాడాలి.
గ్రామీణ డాక్‌ సేవక్స్‌ని ఏడవ వేతన సంఘం పరిధిలోకి తేవాలి. ఇంతకుముందు ఈ డిమాండ్‌ తిరస్కరణకు గురయింది. నూతన ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఉద్యోగ నియామకాలపై నిషేధం విధించింది. దాన్ని ఎత్తేయాలి. రైల్వేలో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆమోదం, రైల్వేని ప్రయివేటీకరించడం, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49శాతానికి పెంచటం, ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌లు, పబ్లికేషన్లు, స్టేషనరీ, దరఖాస్తుల కార్యాలయాలు, మెడికల్‌ స్టోర్లు మొదలైన వాటి మూసివేత, పోస్టల్‌ శాఖను కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించడం, కార్మిక చట్టాల్లో వారి ప్రయోజనాలకు వ్యతిరేకంగా మార్పులు చేయటం లాంటి అనేక కార్మిక వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలి.
ప్రకటనలో పేర్కొన్న పది అంశాలపై ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెలో భాగంగా పలు నిరసన కార్యక్రమాలను వరుసగా చేపట్టాలని, చివరగా నిరవధిక సమ్మెబాట పట్టాలని సమావేశం నిర్ణయించింది.
కార్యాచరణ ఇలా...
డివిజన్‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉమ్మడి సదస్సులు నిర్వహించడం ద్వారా ఫిబ్రవరి 2015కి ముందే ఈ ప్రకటనలోని అంశాలపై అందరికీ అవగాహన కల్పించడం
అన్ని రాష్ట్ర రాజధానుల్లో లేదా ప్రధాన రక్షణ కేంద్రాలున్న ప్రాంతాల్లో మార్చి 2015లో ధర్నాలు లేదా ర్యాలీలు నిర్వహించడం. అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి నిర్వహించే ఈ కార్యక్రమాల్లో ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనేలా చర్యలు
2015, ఏప్రిల్‌నెల మొదటి రెండువారాల్లో పదిహేను రోజుల పాటు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాల నిర్వహణ
ఏప్రిల్‌నెలలో బడ్జెట్‌ సమావేశాలు జరిగే సమయంలో పార్లమెంటు ముందు ర్యాలీ నిర్వహిస్తారు. ఆ ర్యాలీలో నిరవధిక సమ్మెను ఎప్పటినుండి మొదలుపెట్టాలి, దాని తాలూకూ కార్యక్రమాల వివరాలు, సమ్మె నోటీసుని ఇవ్వాల్సిన తేదీని ఖరారు చేయటం

విద్యుత్‌ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌Posted on: Wed 17 Dec 2014
- పదవీ విరమణ వయస్సు 60కి పెంపు
- సీఎం అంగీకారం

విద్యుత్‌ శాఖ ఉద్యోగులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారు. పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏళ్లకు పెంచడానికీ ఆయన సుముఖత వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో విద్యుత్‌ జేఏసీ నాయకులతో నిర్వహించిన భేటీ సందర్భంగా ఆయన వారికి ఈ మేరకు హామీ ఇచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లల్లో శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తోన్న ఉద్యోగులకు ఇవి వర్తిస్తాయి. సమ్మెలో ఉన్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలను పెంచడానికి కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. విద్యుత్‌ జేఏసీ నాయకులు సాయిబాబా, వేదవ్యాస్‌, శివకుమార్‌, కె శ్రీనివాస్‌ తదితరులు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఇంధనశాఖ కార్యదర్శి అజరుజైన్‌ ఇందులో పాల్గొన్నారు. సుమారు 45 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. తమ రాష్ట్రంలోని విద్యుత్‌ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చిన విషయాన్ని జేఏసీ ప్రతినిధులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని, దీనికి సంబంధించిన ఉత్తర్వులను త్వరలో విడుదల చేస్తామని అన్నారు. దీనికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అజరుజైన్‌కు సూచించారు. పదవీ విరమణ వయస్సు 15 ఏళ్లలోపు ఉన్న ఉద్యోగులకు రెండు ఇంక్రిమెంట్లు, 15 ఏళ్ల పైబడి ఉన్న వారికి మూడు ఇంక్రిమెంట్లు ఇస్తామని చంద్రబాబు అన్నారు. పింఛన్‌దారులకు 37.5 శాతం పెంచుతామని చెప్పారు. ఇప్పటిదాకా ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పరిమితం చేసిన పదవీ విరమణ వయస్సు పెంపును జెన్‌కో, ట్రాన్స్‌కో, నాలుగు డిస్కమ్‌ల ఉద్యోగులకు కూడా వర్తింపజేస్తామని చంద్రబాబు అన్నారు.
కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల పెంపు విషయాన్ని జేఏసీ నాయకులు ముఖ్యమంత్రికి వివరించారు. సమాన పనికి సమాన వేతనం కోసం వారు సమ్మె చేపట్టారని అన్నారు. వారి విషయాన్ని మానవతాదృక్పథంతో పరిశీలించాలని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన మొత్తాన్ని పెంచిన తరువాత వారి ద్వారా కాంట్రాక్టు సిబ్బంది వేతనాన్ని పెంచేలా ఏర్పాట్లు చేస్తామని అన్నారు.


డిసెంబర్‌ 19న చలో కలెక్టరేట్‌
విఆర్‌ఏ సమస్యల పరిష్కారం కోరుతను డిసెంబర్‌ 19న రాష్ట్ర వ్యాప్తంగా ఛలో కలెక్టరేట్‌ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవిన్యూ సహాయకుల సంఘం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్‌. పెద్దన్న, కె ఉమామహేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 28వేల మంది విఆర్‌ఏలు వేతనాలు సక్రమంగా అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు.


మేకిన్‌ ఇండియా వద్దు మేడ్‌ ఫర్‌ ఇండియానే ముద్దుPosted on: Sun 14 Dec 2014
- రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతంకొనసాగుతున్న ఆర్థిక పరిస్థితుల్లో భారత్‌లో తయారీ (మేకిన్‌ ఇండియా) వద్దు, భారత్‌ కోసం తయారీ (మేడ్‌ ఫర్‌ ఇండియానే) ముద్దు అని రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఇక్కడ ఫిక్కీ ఏర్పాటు చేసిన భరత్‌రామ్‌ స్మారకోపన్యాసాన్ని ఆయన ఇచ్చారు. ఎగుమతులను పెంచేందుకు ఉద్దేశించిన మేకిన్‌ ఇండియా విధానం ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో అనువైన ఫలితాలనివ్వదని తాను భావిస్తున్నట్లు ఆర్‌బిఐ గవర్నరు చెప్పారు. చైనా వంటి ఆసియా దేశాలకు సత్ఫలితాలనిచ్చినట్లు ఈ విధానం ప్రస్తుత క్లిష్ట ఆర్థిక పరిస్థితుల్లోవున్న భారత్‌కు అంతగా ఉపయోగపడదని అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా పరిశీలిస్తే ఎగుమతుల విషయంలో చైనా ఆధిపత్యానికి గండికొట్టేందుకు ప్రపంచంలో ఏ దేశమూ సిద్ధంగా లేదని ఆయన అన్నారు. అలా అని తాను ఎగుమతుల ఆశావాదాన్ని సమర్ధించటం లేదని ఆయన వివరణ ఇచ్చారు. భారత్‌లో వస్తు తయారీని ప్రోత్సాహించాలన్న అంశానికి బదులుగా ఇక్కడ వ్యాపారాలు అభివృద్ధి చెందేందుకు అనువైన వాతావరణాన్ని కల్పించటంపై ప్రభుత్వం దృష్టి సారించడం మంచిదని ఆయన సూచించారు. అత్యంత ప్రధానమైనవనో, కార్మిక శక్తికి సంబంధించినవనో కొన్ని నిర్దిష్ట పరిశ్రమలకు సబ్సిడీలు కల్పించటానికి బదులు ప్రతి రంగానికి అవసరమైన వస్తువులను అందిచేందుకు చర్యలు తీసుకుంటే బాగుంటుందని అన్నారు. దేశం వెలుపలి డిమాండ్‌ పెరుగుదల రానున్న ఐదేళ్ల వరకూ మందకొడిగానే వుంటుందని, అంతర్గత మార్కెట్‌ల కోసం మన దేశం ఉత్పత్తులు చేసుకోవాల్సి వుంటుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ మాట్లాడుతూ ప్రపంచీకరణ ప్రయోజనాలపై దేశంలో ఏకాభిప్రాయాన్ని ఏర్పరచగలిగితే మన దేశం 8-9 శాతం వృద్ధి రేటునుసాధించటం కష్టసాధ్యం కాబోదన్నారు.



వామపక్ష నేతలు, 'అరబిందో' కార్మికుల అరెస్టుPosted on: Thu 11 Dec 2014
- ఐదు గంటల పాటు సిపిఐ కార్యాలయంలో నిర్బంధం

అరబిందో ఫార్మా కార్మికుల ఆందోళనలకు మద్దతుగా పది వామపక్షాలు శ్రీకాకుళంలో బుధవారం తలపెట్టిన సంఘీభావ ప్రదర్శన, సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ క్రాంతి భవన్‌లో వామపక్ష నాయకులను పోలీసులు నిర్బంధించారు. కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తుండగా పది మంది వామపక్ష నాయకులతోపాటు మొత్తం 20 మందిని అరెస్టు చేసి శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఉన్నారు. సభకు అనుమతి నిరాకరణతో వామపక్ష నాయకులు సిపిఐ కార్యాలయమైన క్రాంతి భవన్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సిద్ధమవుతుండగానే పోలీసులు క్రాంతి భవన్‌లోకి చొరబడి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చాపర వెంకటరమణను అరెస్టు చేశారు. సమావేశం అనంతరం మరోమారు వామపక్ష, కార్మిక సంఘాల నాయకులను అరెస్టు చేసేందుకు యత్నించగా నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. సాయంత్రం 4.30 గంటలకు అక్కడకు చేరుకున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కలెక్టర్‌ను కలిసేందుకు నాయకులతో ప్రదర్శనగా వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చౌదరి తేజేశ్వరరావు, సిపిఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు జెవి.చలపతిరావు, సిపిఐ (ఎంఎల్‌) రాష్ట్ర నాయకులు గుర్రం విజరుకుమార్‌, సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌ రాష్ట్ర నాయకులు టి.సన్యాసిరావు, ఫార్వర్డ్‌ బ్లాక్‌ రాష్ట్ర కార్యదర్శి పివి.సుందరరామరాజు, ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.నానాజీరావు, ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు పి.ప్రసాద్‌తోపాటు పలువురు ఉన్నారు. ఆందోళనలో పాల్గొనడానికొచ్చిన కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఆర్‌టిసి బస్సులను ఆపి తనిఖీలు చేసి కార్మికులను ఎక్కడికక్కడే దించేశారు. కార్మికులు కాని వారిని కూడా బస్సుల్లోనుంచి దించేయడంపై ప్రయాణికులనుంచి నిరసనలు వ్యక్తమయ్యాయి.
అరెస్టులకు నిరసనగా ర్యాలీ నిర్వహించిన కార్మికుల అరెస్టు
వామపక్ష నేతల అరెస్టు విషయం తెలుసుకున్న అరబిందో ఫార్మా కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. వందలాది మంది శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వానికి, జిల్లాకు చెందిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ట్రాఫిక్‌ స్తంభించింది.కార్మికులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
అక్రమ అరెస్టుకు సిపిఎం, సిఐటియు ఖండన
అక్రమ అరెస్టులను సిపిఎం శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి, సిఐటియు శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎం.తిరుపతిరావు, డి.గోవిందరావు ఖండించారు.


స్వేచ్ఛా మార్కెట్‌ విఫలం
ప్రపంచబ్యాంక్‌ ప్రధాన ఆర్థికవేత్త ప్రకటన
'స్వేచ్ఛా మార్కెట్‌ ఆర్థిక నమూనా' విఫల మైందని ప్రపంచ బ్యాంకు ప్రధాన ఆర్థిక వేత్త, భారత ప్రభ్వు మాజీ ఆర్ధిక సలహాదారు కౌశిక్‌ బసు అన్నారు. ఈ విషయమై ప్రపంచ మంతా దాదాపు ఏకాభిప్రా యానికి వచ్చిందని ఆయన చెప్పారు.
ఆదివారం ఢిల్లీలో జరిగిన ఓ సదస్సులో పాల్గొన్న కౌశిక్‌బసు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి, కేంద్ర ఆర్థికమంత్రితో పాటు రాష్ట్ర ప్రభుత్వమూ స్వేఛ్చా మార్కెట్‌ జపం చేస్తున్న నేపధ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతనంతరించుకున్నాయి. నిర్ణయాలను పూర్తిగా మార్కెట్లకు వదిలేస్తే సమాజంలో తీవ్ర అసమానతలు చోటు చేసుకుంటాయని, ఇది రాజకీయంగా కూడా పనిచేయదని బసు చెప్పారు.

సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక, ఉద్యోగుల భారీ ర్యాలీ
Posted on: Tue 16 Dec 00:59:29.202739 2014

             లూథియానా; అపరిష్కృతంగా వున్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, ఉద్యోగులు సోమవారం నాడు పంజాబ్‌లోని చాతర్‌ సింగ్‌ పార్క్‌ వద్ద ర్యాలీ నిర్వహించారు. డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయానికి వెళ్లి అక్కడ మెమోరాండం సమర్పించారు.
      సిఐటియు నాయకులు రఘునాథ్‌ సింగ్‌, చందర్‌ శేఖర్‌, జతిందర్‌ పాల్‌ సింగ్‌, తర్సెమ్‌ జోధాన్‌, లాల్‌ జెండా పంజాబీ భాట్టా మజ్దూర్‌ యూనియన్‌ నాయకుడు, మాజీ సిపిఎం ఎమ్మెల్యే హర్జీత్‌ కౌర్‌తో పాటు పలు కార్మిక సంఘాల నాయకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులను కనీస వేతన చట్టాల పరిధిలోకి తీసుకోవాలని, 44, 45వ భారత శ్రామిక సదస్సు సూచనల మేరకు 15వేల వేతనాన్ని చెల్లించాలని వారు డిమాండ్‌ చేశారు. అలాగే 180 మంది వరకు ఉన్న ఆఫీస్‌ సిబ్బందిని క్రమబ ద్ధీకరించి, వారికి పంజాబ్‌ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ర్యాలీ అనంతరం ఐదువేలకు పైగా కార్మికులు తమ ఆందోళనతో రోడ్లను దిగ్బంధించారు.
       ఈ నేపథ్యంలో గంటకు పైనే ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది. చివరికి జిల్లా పాలనా యంత్రాంగం దిగివచ్చి యూనియన్‌ నాయకులు పంజాబ్‌ ముఖ్యమంత్రితో సమావేశమయ్యే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చింది.

విద్యుత్‌ సరఫరా ప్రైవేటీకరణపై ఉద్యోగుల నిరసన పోరాటం
Posted on: Tue 09 Dec  2014
                న్యూఢిల్లీ : విద్యుత్‌ సరఫరాను ప్రైవేటీకరించడానికి వీలుగా 2003 విద్యుత్‌ చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడంపై ఉద్యోగులు, ఇంజినీర్లు భారీ ఎత్తున ఇక్కడి జంతర్‌ మంతర్‌ వద్ద సోమవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. ప్రముఖ కార్మిక సంఘ నాయకుడు ఎబి బర్దన్‌ దీనికి నాయకత్వం వహించారు. ఎంపి, సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌, శైలేంద్రదూబే, కెఒ హబీబ్‌, వి.అశోక్‌కుమార్‌, పిఎన్‌ చౌదురి, పి.రత్నాకరరావు, కె.అశోక్‌రావు, ఎస్‌బి సింగ్‌, మోహన్‌శర్మ, ఎస్‌.రథిన సభాపతి, తదితర సీనియర్‌ నేతలు ఈ ప్రదర్శనలో పాల్గొని ప్రసంగించారు. ఎన్‌సిసిఒఇఇఇ నేతలు తరువాత కేంద్ర విద్యుత్‌ మంత్రి శ్రీ పీయూష్‌ గోయల్‌ను శ్రమశక్తి భవన్‌ వద్ద కలుసుకుని మెమోరాండం సమర్పించారు. ప్రజలు వ్యతిరేకించే చట్ట సవరణలను, ప్రైవేటు రంగం ఆధారంగా విద్యుత్‌ విధానాన్ని పునస్సమీక్షించడాన్ని ఉపసంహరించుకోవాలని కోరారు. 26 వేల కోట్ల నష్టం పేరుతో ఎస్‌ఇబిలను రద్దు చేశారని, ఇప్పుడు డిస్కమ్‌ల నష్టాలు రూ.5 లక్షల కోట్లు దాటాయని, ఇవన్నీ విద్యుత్‌ సంస్కరణల వైఫల్యాలేనని మెమోరాండంలో పేర్కొన్నారు. 12 ఏళ్ల క్రితమే డివిబిని నేరుగా ప్రైవేటీకరించారని, బడా కార్పొరేట్‌ సంస్థలకు సరఫరా నెట్‌వర్కు అప్పగించారని


జనపనార ఉత్పత్తుల చట్టం రద్దు తగదు
Posted on: Tue 09 Dec 2014
*
 కేంద్ర జౌళి శాఖ మంత్రికి తపన్‌సేన్‌ లేఖ

         జనపనార ప్యాకింగ్‌ ఉత్పత్తులకు సంబంధించిన, జ్యూట్‌ ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ యాక్ట్‌ 1987ని దశలవారీగా రద్దుచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండించింది. దీనిపై ప్రభుత్వం తన వైఖరిని పునస్సమీక్షించుకోవాలని కోరింది. సిఐటియు ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపి తపన్‌సేన్‌ శనివారం కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి గాంగ్వార్‌కి ఈ మేరకు ఒక లేఖ రాశారు.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జనపనార పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. గోనె సంచులు, ఇతర ఉత్పత్తుల పరిశ్రమ దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. దీనిపై ఆధారపడిన నాలుగు లక్షల మంది కార్మికులు, 30 లక్షలమంది జనపనార ఉత్పత్తిదారులు, వారి కుటుంబా లు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.అని తపన్‌సేన్‌ పేర్కొన్నారు. అన్నింటికంటే విచిత్రం ఏమిటంటే వాటాదారుల సమావేశం అంటూ ఏర్పాటు చేస్తున్న మీటింగులో అసలైన వాటాదారులైన ఆ పరిశమ్రపై ఆధారపడి ఉన్నవారు, అందులో పనిచేసేవారు, దాని ఉత్పత్తిదారులు, రైతులు లేకపోవటం. వారి భాగస్వా మ్యం లేకుండానే వారిపైన అత్యంత ప్రభావాన్ని చూపే నిర్ణయాన్ని తీసుకోవటం తగునా?అని ప్రశ్నించారు. జ్యూట్‌ సెక్టార్‌కి సంబంధించి ఇంత ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి వాస్తవాలను పూర్తిగా విస్మరించారు. సింథటిక్‌ ప్యాకేజింగ్‌ రంగానికి చెందిన దేశీయ, విదేశీ ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూర్చేందుకే ప్రభుత్వ చర్య ఉపయోగపడుతుం దన్నారు..
                జనపనార పరిశ్రమ కార్మికులకు కల్పించే ఉపాధి కంటే వీరు ఇవ్వగల ఉద్యోగావకాశాలు చాలా తక్కువ. జనపనార కార్మికులు, రైతులు, వారి కుటుంబాలు కలిసి మొత్తం 40లక్షల మంది ఈ పరిశమ్రపై ఆధారపడి ఉన్నారు. ప్రస్తుతం 29వేల జనపనార మగ్గాలు దేశంలో పనిచేస్తున్నాయి. వీటినుండి వచ్చే నారతో 20.5 లక్షల టన్నుల జనపనార బుట్టలు సంచులు తయారవుతు న్నాయి. రోజుకి మూడు షిఫ్టులుగా కార్మికులు పనిచేస్తున్నారు. మనదేశంలో దాదాపు 2.4లక్షల టన్నుల జనపనార సంచులను (జ్యూట్‌ ప్యాకేజింగ్‌ మెటీరియల్స్‌ చట్ట ప్రకారం చేసే సేకరణ కాకుండా) వినియోగించు కుంటున్నాం.
సగటున 80వేల నుండి లక్ష టన్నుల వరకు జనపనార సంచులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇవి కాకుండా 17లక్షల టన్నుల జనపనార సంచులను జెపిఎమ్‌ చట్టం ప్రకారం ఆహార ఉత్పత్తులు, పంచదార మొదలైన వాటి ప్యాకేజింగ్‌లకోసం సేకరిస్తున్నారు. ప్రస్తుతం పంచదార, ఆహార ఉత్పత్తులను బట్టి ఆహార ఉత్పత్తులకు, పంచదారకు 9లక్షల టన్నుల జనపనార సంచులు సరిపోతాయి. ఆహార ఉత్పత్తులకు 100శాతం, పంచదార నిల్వలకు 20శాతంగా జనపనార సంచుల రిజర్వేషన్‌ నిర్ణయిస్తే ఎనిమిది లక్షల టన్నుల జ్యూట్‌ ఉత్పత్తులు నిరుపయోగమై పోతాయి. ఇప్పటికే సగటున జనపనార మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికులు సగానికి సగం తగ్గిపోయారు. ఇక వీటిని మూసేసినా, షిఫ్టులు తగ్గించినా నేరుగా ఉపాధి అవకాశాలు తగ్గుతాయి. కార్మికులు ఆదాయం కోల్పోతారు. మరో వైపు జనపనార ఉత్పత్తిదారులపై ఈ ప్రభావం పడుతుంది. ప్రభుత్వం తరపున జనపనార సేకరణ లేనపుడు రైతులకు మద్దతుధర లభించదని తపన్‌ సేన్‌ తెలిపారు.
          ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జెపిఎమ్‌ చట్టం ప్రకారం జనపనార ఆహార ఉత్పత్తుల ప్యాకేజింగ్‌లను మొదటి విడతలో 70శాతానికి తరువాత రెండు మూడు సంవత్సరాల్లో జీరోకి తగ్గించాలని చూస్తోంది. ఇది కాకుండా పంచదార ప్యాకింగులకు దీన్ని పూర్తిగా తప్పించడమంటే అది జ్యూట్‌ పరిశ్రమ పాలిట మరణ మృదంగమే అవుతుంది. 40 లక్షల కుటుంబాలు నేరుగా నష్టపోవడమే కాకుండా దీన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఆర్థికంగా నష్టపోతాయి. అని ఆయన విమర్శించారు.

బీమా'పై బిజెపికి కాంగ్రెస్‌ ధీమా!
Posted on: Tue 09 Dec 2014
                 
 న్యూఢిల్లీ : బిజెపి ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టబోయే బీమా బిల్లుకు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. బీమా రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచడానికి మోడీ సర్కార్‌ తీవ్ర ప్రయత్నం చేస్తోన్న విషయం తెలిసిందే. సోమవారం జరిగిన సెలెక్ట్‌ కమిటీలో మెజారిటీ సభ్యులు ఈ బిల్లుకు మద్దతు చేశారని సమాచారం. కమిటీలోని 15 మంది సభ్యుల్లో 11 మంది అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ వారం చివరి కల్లా బీమా బిల్లు రాజ్యసభకు రానుందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.
             దేశీయ బీమా రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ఉద్దేశించిన ఈ బిల్లును ప్రధానంగా సిపిఎం, సమాజ్‌వాది పార్టీ, తృణముల్‌ కాంగ్రెస్‌, జనతా దల్‌-యునైటెడ్‌ పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌ ఈ బిల్లుపై మెతక వైఖరీని అవలంబిస్తోంది. తమ యుపిఎ హయంలో రూపొందించిన బిల్లును ప్రవేశపెడితే అనుమతించడానికి సిద్దంగా ఉన్నామని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.


సబ్సిడీలపై వేటు తప్పదు
Posted on: Sun 07 Dec 2014

బీమా బిల్లుపై అవసరమైతే సంయుక్త
పార్లమెంటరీ సమావేశం : అరుణ్‌ జైట్లీ
       న్యూఢిల్లీ : ఆర్థిక సంస్కరణలను ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్‌డిఎ ప్రభుత్వం నిబద్ధతతో వుందని భారత పారిశ్రామికవర్గానికి ఆర్ధిక మంత్రి అరుణ్‌్‌ జైట్లీ హామీ ఇచ్చారు. సబ్సిడీల హేతుబద్ధీకరణ అంటే కుదింపునకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ''వ్యయ నిర్వహణా కమిషన్‌తో వరుసగా సమావేశాలు జరిపాను. సబ్సిడీల హేతుబద్ధీకరణకు సంబంధించి వారు బాగానే కసరత్తు చేస్తున్నారు.'' అని చెప్పారు. 'త్వరలోనే వారు కొన్ని తాత్కాలిక సిఫార్సులతో ముందుకు వస్తారు.
అప్పుడు ఆ దిశగా హేతుబద్ధీకరణతో ముందుకు సాగుతామని' జైట్లీ సెలవిచ్చారు. డీజిల్‌ ధరలను మార్కెట్‌ ధరలతో ముడిపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని గుర్తు చేసుకుంటూ దీనివల్ల ప్రభుత్వంపై సబ్సిడీ భారం తగ్గిందన్నారు. శనివారం నాడు టెలివిజన్‌ చానెల్‌ ఇటి నౌ నిర్వహించి న ఆర్ధిక సదస్సులో ఆయన మాట్లాడారు.
              దీనికితోడు, ఎంపిక చేసిన నగరాల్లో ఎల్‌పిజి వినియోగదారులకు ప్రయోగా త్మక పద్ధతిన నేరుగా నగదు సబ్సిడీని ఇవ్వాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించిందని తెలిపారు ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ నేతృత్వంలో ఒక కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసిందని, ఆర్ధిక లోటును తగ్గించడంలో ప్రభుత్వానికి ఇది సహాయకారిగా వుంటుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం వివిధ రకాల సబ్సిడీలు అందజేస్తోంది.
            2014-15 సంవత్సరంలో ఈ సబ్బిడీలు రూ.2.51లక్షల కోట్లకు చేరుకున్నాయని అన్నారు. పార్లమెంట్‌ ప్రస్తుత సమావేశాల్లోనే ఇన్సూరెన్స్‌, జిఎస్‌టి బిల్లులు తీసుకువస్తామన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రాజ్యసభలో మెజారిటీ లేనందున బిల్లుల ఆమోదానికి పార్లమెంట్‌ ఉభయ సభలను సమావేశపరిచే ఆలోచన చేస్తున్నట్లు వచ్చిన వార్తల గురించి ప్రస్తావించగా అది చిట్ట చివరి అవకాశం మాత్రమేనని, ఒకవేళ అనివార్యమైతే అది రాజ్యాంగ బద్ధ పరిష్కారం కాబట్టి దానికే ఓటు వేస్తామని చెప్పారు.

పాలకులారా ఖబడ్దార్‌!
Posted on: Sat 06 Dec  2014

కార్పొరేట్‌ అనుకూల విధానాలను మార్చుకోండి
- మోడీ సర్కార్‌కు కార్మిక సంఘాల అల్టిమేటం
- జాతీయస్థాయిలో ఐక్యమైన 11 సంఘాలు
- ఢిల్లీలో భారీ ధర్నా, విజయవాడ, హైదరాబాద్‌లలో భారీ జాతాలు
- భవిష్యత్తు కార్యాచరణపై 5న సమావేశం
ప్రజాశక్తి యంత్రాంగం- న్యూఢిల్లీ, విజయవాడ
               మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై కార్మిక సంఘాలు శుక్రవారం సమర భేరి మోగిం చాయి. అటు దేశ రాజధాని, ఇటు రాష్ట్ర రాజధాని కార్మికుల భారీ ధర్నాలు, ర్యాలీలు, నినాదాలతో హోరెత్తాయి. కోల్‌కతా, తిరువనంతపురం, ముంబయి, చెన్నయితో సహా దేశవ్యాపితంగా అన్ని ప్రధాన నగరాల్లోను కార్మికులు కదం తొక్కారు. మోడీ ప్రభుత్వ కార్పొరేట్‌ అనుకూల విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికులహక్కులను కాలరాచే సంస్కరణలను మార్చుకోకుంటే ఖబడ్డార్‌ అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. పదకొండు కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు నందుకుని ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. విజయవాడ, హైదరాబాద్‌లలోనూ భారీ జాతాలు నిర్వహించారు. భవిష్యత్తు కార్యా చరణపై ఈ నెల 15న కార్మిక సంఘాలన్నీ సమావేశ మవుతున్నాయని సిఐటియు జాతీయ ప్రధాన కార్య దర్శి తపన్‌సేన్‌ వెల్లడించారు. ఢిల్లీలో వేలాది మంది తో జరిగిన ధర్నానుద్దేశించి సిఐ టియు జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ మాటా ్లడుతూ.. 'కార్పొరేట్లకు ప్రయోజనాలకు కలిగించే విధంగా మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్మిక సంస్కరణలకు పూనుకుం టోంది. కార్మిక చట్టాల ప్రయోజనాల నుంచి కార్మి కులను నెట్టివేసే విధంగా సవరణలు చేపడుతోంది. ప్రభుత్వం
చేపడుతున్న ప్రజా, కార్మిక, జాతి వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఆందోళనలు చేపడుతున్నాం. ఇది ఆరంభం మాత్రమే. కేంద్ర విధానాలను నిరసిస్తూ ఇప్పటికే అన్ని రంగాల్లో ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఆ ఆందోళనలను జాతీయ స్థాయిలో జరుగుతున్న ఉద్యమాలకు అనుసంధానం చేసి ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి చేస్తాం. ప్రజల ఓట్లతో ప్రజాస్వామ్యయుతంగా గెలిచిన మోడీ ప్రభుత్వం, నేడు వారి సంక్షేమాన్ని గాలి కొదిలి ఎన్నికల ముందు ఆర్థికంగా తోడ్పాటునందించిన కార్పొరేట్ల కొమ్ముకాస్తోంది. ఇది ప్రజలను వంచించడమే. మరోవైపు దేశంలోని సునిశిత రంగాలైన రక్షణ, బీమా రంగాల్లో ఎఫ్‌డిఐలను అనుమతిస్తోంది. ఇప్పటికే రైల్వేల్లో 100 శాతం ఎఫ్‌డిఐకి ఎర్రతీవాచీ పరిచింది. ఇలా ఏ రంగాన్నీ వదలకుండా అన్నింట్లో ఎఫ్‌డిఐలను స్వాగతిస్తే భారతదేశ స్వాతంత్య్రానికి అర్థమేముంది' అని ప్రశ్నించారు. ఓ వైపు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రయివేటీకరిచడం, మరోవైపు కార్మిక చట్టాలను సరళీకరిస్తూ కార్మికుల హక్కులను కాలరాయడం, ఇంకోవైపు ఈ విధానాలను నిరసిస్తున్న కార్మికుల గొంతు నొక్కడం లాంటి అనైతిక చర్యలకు దిగుతోందని విమర్శించారు. కార్మిక సంఘాల భవిష్యత్తు కర్తవ్యాలపై ఈ నెల 15న  సమావేశమైవుతున్నట్లు తపన్‌సేన్‌ చెప్పారు. ఎఐటియుసి కార్యదర్శి గురుదాస్‌ దాస్‌ గుప్తా మాట్లాడుతూ.. కార్మిక చట్టాల సవరణల్లో ట్రేడ్‌ యూనియన్ల అభిప్రాయాలు తీసుకుంటామని చెప్పి ప్రభుత్వం ఒంటెద్దు పోకడ అవలంబిస్తోందన్నారు. కేంద్రంలో కార్పొరేట్ల జులుం పెరిగే విధంగా ప్రభుత్వం తన విధానాలు చేపడుతోందని విమర్శించారు. దేశంలోని చట్టాలన్నీ సరళీకరిస్తూ విదేశీ కార్పొరేట్లకు దేశంలో రావడానికి ఎర్రతివాచీ పరుస్తున్నారని విమర్శించారు. విదేశాలకు వెళ్తూ అక్కడి పెట్టుబడిదారులకు ఇదే చెబుతున్నారని దుయ్యబట్టారు. మోడీ సర్కార్‌ కార్పొరేట్‌, ప్రయివేట్‌ వ్యక్తుల కనుసన్నల్లో పని చేస్తోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోవాలని నేటి సమావేశం ద్వారా ఒక నోటీసు ఇస్తున్నామని, మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
          దేశాన్ని నడిపిస్తోంది కార్మికులేనని, కార్పొరేట్లు కాదని మోడీ గుర్తించుకోవాలని హితవు పలికారు. కార్మికుల ఐక్యతను దెబ్బతీసే విధంగా కొన్ని పత్రికలు కథనాలు వెలువరిస్తున్నాయని విమర్శించారు. బిఎంఎస్‌ కార్యదర్శి విర్జేష్‌ ఉపాధ్యాయ మాట్లాడుతూ.. 'కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్మిక సంస్కరణల్లో కార్మికుల సంక్షేమం కన్నా కార్పొరేట్ల ప్రయోజనాలు దాగున్నాయి. ఈ సంస్కరణలతో కార్మికుల సామాజిక భద్రతకు భంగం వాటిల్లనుంది. కార్మిక హక్కులను రక్షించేందుకే ఆందోళన బాట పట్టాం. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేదు. కార్మికుల ప్రయోజనాల కోసం పోరాడతాం' అని తెలిపారు. దీంతోపాటు ఐఎన్‌టియుసి, హెచ్‌ఎంఎస్‌, ఎఐటియు టియుసి, టియుసిసి, ఎస్‌ఇడబ్ల్యుఎ, ఎఐసిసిటియు, యుటియుసి, ఎల్‌పిఎఫ్‌, ఎంఇసితో పాటు మరికొన్ని స్వతంత్ర సంఘాలు నాయకులు మాట్లాడారు.
 విఆర్ కృష్ణ అయ్యా‌ర్ అస్త‌మ‌యం

సుప్రసిద్ధ న్యాయకోవిదుడు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ మంత్రి విఆర్‌ కృష్ణ అయ్యర్‌ గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు కన్ను మూశారు. దేశంలోనే మొట్టమొదటి సారి ఇఎంఎస్‌ నేతృత్వంలో కేరళలో ఏర్పడిన కమ్యూనిస్టు మంత్రివర్గంలో ఆయన హోమ్‌, న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన నూరవ జన్మదిన వేడుకలను ఇటీవలే జరుపుకున్నారు. ఆయన శ్వాసకోశ సంబంధమైన వ్యాధులతో గత నెల24న ఇక్కడ మెడికల్‌ ట్రస్ట్‌ ఆసుపత్రిలో చేరారు. ఆ తరువాత మూత్ర పిండాలు, గుండె సంబంధమైన సమస్యలు తలెత్తడంతో ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. గురువారం మధ్యాహ్నం 3.15 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. న్యాయవాదిగా, న్యాయమూర్తిగా, మంత్రిగా ఆయన చేసిన వాదనలు, వెలువరించిన తీర్పులు, చేసిన నిర్ణయాలన్నీ ఈ దేశంలో అట్టడుగువర్గాల ప్రజలకు ఎంతో మేలు చేకూర్చాయి.
             ఆయన మరణవార్త విన్నవెంటనే ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. ప్రజల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని కదవంత్రా ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంచుతారు. ఆ తరువాత రవిపురంలో అంత్యక్రియలు జరుగుతాయి. 1973 జులై 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలుచేపట్టి 65 ఏళ్ల వయస్సులో 1980 నవంబర్‌ 14న పదవీ విరమణ చేశారు. 1915లో తలస్సెరిలో ప్రముఖక్రిమినల్‌ న్యాయవాది వివి రామ అయ్యర్‌ దంపతులకు జన్మించిన వైద్యానతపురం రామా అయ్యర్‌ కృష్ణఅయ్యర్‌ ఇంటర్మీడియట్‌ను పాలక్కడ్‌ విక్టోరియా కాలేజీలో పూర్తి చేశారు. బిఏ పట్టా అన్నామలై యూనివర్సిటీ నుంచి పొందారు. మద్రాస్‌ లా కాలేజ్‌నుండి న్యాయవాద పట్టా పుచ్చుకుని 1937లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1952లో మద్రాస్‌ శాసనసభకు ఎన్నికైన అయ్యర్‌ 1957లో ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేరారు. భూ సంస్కరణల బిల్లుతో సహా పలు ప్రజానుకూల చట్టాలను రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇఎంఎస్‌ ప్రభుత్వాన్ని కేంద్రం డిస్మిస్‌ చేసిన తరువాత న్యాయవాది వృత్తిని తిరిగి చేపట్టారు.
ప్రధాని, ప్రముఖుల సంతాపాలు
          జస్టిస్‌ కృష్ణఅయ్యర్‌ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. న్యాయవేత్త, వేదాంతి అయిన కృష్ణ అయ్యర్‌ అంతకు మించిన మానవతా వాది అని ఆయన నివాళులర్పించారు.

హెచ్చరించిన కోల్‌ ఇండియా కార్మిక సంఘాలు
                       కోల్‌కతా : కోల్‌ ఇండియాలో ప్రైవేటు భాగస్వామ్యానికి తలుపులు తెరవడం, బొగ్గును వాణిజ్యపరంగా తవ్వుకోవడానికి ప్రైవేటు శక్తులను అనుమతించడం వంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటే తాము నిరవధిక సమ్మెకు దిగుతామని 90శాతం కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర బొగ్గు గని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. ఈ విషయంపై చర్చించేందుకు ఒకటి రెండు రోజుల్లో సమావేశం నిర్వహించాల్సిందిగా యూనియన్లు బొగ్గు మంత్రిత్వ శాఖకు విజ్ఞప్తి చేశాయి. బొగ్గు గనుల (ప్రత్యేక నిబంధనల) ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌ ముందు ప్రవేశపెట్టేలోగానే ఈ సమావేశం జరగాలని కోరాయి. ఒకవేళ అలా జరగకపోతే, ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేందుకు తామేం చేయాలో అది చేస్తామని చెప్పాయి. బొగ్గు మంత్రితో గానీ, బొగ్గు శాఖ కార్యదర్శితో గానీ సమావేశం నిర్వహించాల్సిందిగా ఇప్పటికే కోరి వున్నాం. అది గనుక ఒకట్రెండు రోజుల్లో జరగకపోతే తమ తదుపరి కార్యాచరణ ఏమిటనేది నిర్ణయించుకుంటామని భారత జాతీయ గని కార్మికుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్‌.క్యు.జామా తెలిపారు. ఈ దశలో బొగ్గు గనుల తవ్వకా లను ప్రైవేటీకరణ కాకుండా అడ్డగించడమే తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఎలాంటి పరిస్థితులకోర్చి అయినా సరే ఆపుతామని అన్నారు. నవంబరు 24న జరగాల్సిన సమ్మెను యూనియన్లు వాయిదా వేశారు. ప్రభుత్వం ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు కచ్చితంగా యూనియన్లతో చర్చిస్తుందని బొగ్గు శాఖ కార్యదర్శి హామీ ఇవ్వడంతో సమ్మె వాయిదా వేశారు.


దక్షిణాది రాష్ట్రాల్లో బ్యాంక్‌ల సమ్మె సక్సెస్‌
Posted on: Wed 03 Dec 00:39:30.999962 2014

              చెన్నై : దక్షిణాది రాష్ట్రాల్లోని 30 వేల ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్రాంచీలకు చెందిన 2.5 లక్షల మందిబ్యాంక్‌ ఉద్యోగులు మంగళ వారం రిలే సమ్మె నిర్వహించడంతో బ్యాంకింగ్‌ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. వేత నాలను సవరించాలని కోరుతూ జోన్ల వారీగా బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన సమ్మెను మొదట సౌత్‌ జోన్‌ నుంచి ప్రారంభించారు. ఈ జోన్‌ పరిధిలోని తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా, కర్నాటక, కేరళ, లక్షదీవులకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగులు, సిబ్బంది యావ న్మంది సమ్మెలో పాల్గొన్నారు. యునైటెడ్‌ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌ (యుఎఫ్‌బియు) ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మె జరిగింది. స్వీపర్‌ నుండి బ్యాంక్‌ చీఫ్‌ మేనేజర్‌ స్థాయి వరకు సిబ్బంది అందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఉత్తర జోన్‌లో బుధవారం, తూర్పు జోన్‌లో గురువారం, పశ్చిమ జోన్‌లో శుక్రవారం రిలే సమ్మెలు నిర్వహించనున్నారు. ఐదేళ్ళ పాటు కొనసాగిన చివరి ద్వైపాక్షిక ఒప్పందం 2012 అక్టోబరు 31తో ముగిసింది. కొత్తది అదే ఏడాది నవంబరు 1వ తేది నుండి ప్రారంభం కావాల్సి వుంది. రెండేళ్ళు గడిచినా ఇప్పటివరకు ప్రభు త్వం ఆ విషయం పట్టించుకోవడం లేదు. తొమ్మిది యూనియన్లతో కూడిన యుఎఫ్‌బియు తొలుత 25శాతం వేతనాలు
పెంచాలని డిమాండ్‌ చేసింది. అయితే, ఆ తర్వాత 23శాతానికి దిగి వచ్చింది. కానీ, ప్రభుత్వం కానీ ఐబిఎ కానీ 11శాతానికన్నా ఇచ్చేది లేదని పట్టుబడుతున్నాయి. 13దఫాలుగా చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేదు. ఇదే సమయంలో అంటే ఈ రెండేళ్ళలో బ్యాంక్‌ లాభాలు రెండు రెట్ల కన్నా ఎక్కువ పెరిగాయి. వ్యాపారం 33లక్షల కోట్ల నుండి 115కోట్ల లక్షలకు చేరింది. 25వేలకు పైగా శాఖలు ప్రారంభమయ్యాయి. అయినా ప్రభుత్వం తన పట్టు సడలించడం లేదు. ఎన్నిసార్లు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో ఇక సమ్మెకు దిగారు. రాష్ట్రాల వ్యాప్తంగా వచ్చిన వార్తలు చూస్తే 50కి పైగా కేంద్రాల్లో బ్రహ్మాండమైన ప్రదర్శనలు జరిగాయి. ప్రభుత్వం తన పట్టు సడలించకపోతే నిరవధిక సమ్మెకు దిగడం తప్ప మరో మార్గం లేదని ఉద్యోగులు, యూనియన్లు భావిస్తున్నాయి.





     

1, జులై 2016, శుక్రవారం

భారత్‌కు అణు విద్యుత్‌ అవసరమా?

  1. దేశం అభివృద్ధి చెందాలంటే విద్యుదుత్పత్తి పెంచాలని, అందులోనూ అణు విద్యుత్‌ అయితే మన దేశీయ అవసరాలు సునాయాశంగా తీరతాయంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రచారం వింటుంటే ఆశ్చర్యం కలగకమానదు! ప్రపంచంలో అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్‌ది ఐదో స్థానం. దేశంలో విద్యుత్‌ ఉత్పత్తికి, వినియోగానికి మధ్య తేడా కేవలం 12 శాతం మాత్రమే అన్నది వాస్తవం! ఈ లోటు భర్తీ చేయాలంటే అణు విద్యుత్‌ ఉత్పత్తి చేయడమే పరిష్కారమని, అమెరికా అణు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడమే శరణ్యమని పాలకులు చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధం! 2012లో అమెరికాతో అణు ఒప్పందం చేసుకున్నప్పుడే ఈ ప్రమాదాన్ని వామపక్షాలు దేశానికి తెలియజేశాయి. కానీ అప్పటి అధికార, ప్రతిపక్షాలు దాన్ని కొట్టిపారేశాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్నదేమిటి? 

21, జనవరి 2015, బుధవారం

మహిళా ఉద్యోగి తొలగింపు ఉత్తర్వు రద్దు
Posted on: Wed 21  2015

- కోర్టు జోక్యంతో దిగివచ్చిన టాటా
    చెన్నై: నిబంధనలకు విరుద్ధంగా టాటా కన్సల్టెన్సీ కంపెనీ తనని ఉద్యోగం నుండి తొలగించడంపై ఒక మహిళా ఉద్యోగి కోర్టుకెక్కారు. దాంతో ఆ కంపెనీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. మహిళకు ఇచ్చిన ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులను రద్దు చేసినట్టుగా కంపెనీ మంగళవారం కోర్టుకి తెలిపింది. గర్భవతి అయిన రేఖ (పేరు మార్చాం) అనే ఉద్యోగినికి కంపెనీ డిసెంబరు 22, 2014న ఉద్యోగం నుండి తొలగిస్తున్నామని తెలిపే ఉత్తర్వులు ఇచ్చింది. జనవరి 21, 2015నుండి ఆమె ఉద్యోగానికి రానవసరం లేదని కూడా అందులో తెలిపింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం ఆమె కోర్టులో కేసు వేసింది. జనవరి 13న కోర్టు ఆమె ఉద్యోగ తొలగింపుపై నాలుగువారాల పాటు స్టేని ఇచ్చింది. తిరిగి కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. మంగళవారం కేసు కోర్టులో విచారణకు వచ్చినపుడు కంపెనీ న్యాయవాది, మద్రాస్‌ హైకోర్టు న్యాయమూర్తి ఆర్‌ సుబ్బయ్యకు రేఖ ఉద్యోగ తొలగింపు ఉత్తర్వులు రద్దుచేసినట్టుగా వెల్లడించారు. దాంతో న్యాయమూర్తి కేసుని మూసివేస్తున్నట్టుగా ప్రకటించారు. కంపెనీ, అసిస్టెంటు కన్సల్టెంటు ఆపై హోదాల్లో పనిచేస్తున్న 25వేలమంది ఉద్యోగులను అక్రమంగా తొలగించిందని రేఖ కోర్టుకి తెలిపింది. అందుకు ప్రతిగా క్యాంపస్‌ ఎంపికల్లో 55వేలమందికి ఉద్యోగాలిచ్చిందని, ఖర్చు తగ్గించుకునేందుకు కంపెనీ ఈ నిర్ణయం తీసుకుందని రేఖ కోర్టుకి వెల్లడించింది.ఎయిర్‌పోర్టు ఉద్యోగుల సమ్మె హెచ్చరిక
Posted on: Mon 19 Jan 00:46:24.785033 2015

                         న్యూఢిల్లీ: ప్రభుత్వ విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలన్న ఆలోచనను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని,లేదంటే సమ్మె చేయక తప్పదని ఎయిర్‌పోర్టు అథారిటీ ఉద్యోగుల యూనియన్‌ హెచ్చరించింది.ఈ మేరకు పౌరవిమానయాన శాఖామంత్రి అశోక్‌గజపతిరాజుకు ఒక లేఖ రాసింది. దేశంలోని చెన్నరు, కొల్‌కతా, జైపూర్‌, అహ్మదాబాద్‌ నాలుగు విమానాశ్రయాల నిర్వహణ, కార్యకలాపాలు, విస్తరణను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయంపై యూనియన్‌ ఆందోళన వ్యక్తం చేసింది. ఇది కొన్నాళ్లక్రితం ప్రభుత్వం ఆమోదించిన త్రిసభ్యకమిటీ సిఫార్సులను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించింది. లేఖ ప్రతులను ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ఆర్థికమంత్రి, ఎయిర్‌పోర్టు అథారిటీ చైర్మన్‌, కార్మికశాఖ ముఖ్యకమిషనర్‌, పర్యాటక, రవాణా, సాంస్కృతిక విభాగాల పార్లమెంటరీ పానెల్‌కు పంపినట్లు యూనియన్‌ తెలిపింది. పిపిపి కింద గత యుపిఎ ప్రభుత్వం విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని భావించినా ఉద్యోగుల వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని యూనియన్‌ లేఖలో పేర్కొంది. ప్రభుత్వ విమానాశ్రాయాలతో పోలిస్తే ప్రైవేటు విమానాశ్రయాల వద్ద ప్రయాణీలకు సేవా రుసుము మరింత భారం కానుందన్నారు. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, ముంబయి విమానాశ్రయాలు ప్రైవేటు జివికె, జిఎంఆర్‌ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ప్రయాణం మరింత ఖరీదైందని గుర్తుచేశారు.
బిఎస్‌ఎన్‌ఎల్‌ రక్షణ కోసం సమరం
Posted on: Wed 21 Jan 00:42:21.209613 2015

- ఎపి సర్కిల్‌ మహాసభల్లో సిహెచ్‌. నర్సింగరావు
ప్రజాశక్తి - రాజమండ్రి ప్రతినిధి
         ప్రభుత్వరంగ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్‌ రక్షణ కోసం ఉద్యోగులంతా సమర శంఖారావం పూరించాలని సిఐటియు ఎపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్‌ నర్సింగరావు పిలుపునిచ్చారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎపి సర్కిల్‌ 4వ మహాసభలు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళాకేంద్రం ఎస్‌ఆర్‌ నాయక్‌ ప్రాంగణంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నర్సింగరావు ప్రారంభోపన్యాసం చేశారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ నష్టాలకు ప్రభుత్వాల విధానాలే కారణమని ఆయన స్పష్టం చేశారు. మారుతున్న అవసరాలు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోనీయకుండా బిఎస్‌ఎన్‌ఎల్‌ను అడ్డుకుంటూ, రిలయన్స్‌, ఐడియా వంటి బహుళజాతి కంపెనీలకు అవకాశాలు కల్పిస్తున్నారని విమర్శించారు. రూ.80 వేల కోట్లు లాభాల్లో ఉన్నప్పుడు ఆధునీకరణ కాకుండా ప్రభుత్వం అడ్డుకుందని చెప్పారు. శాటిలైట్‌ ద్వారా కమ్యూనికేషన్‌ సమాచారం అందించడానికి బిఎస్‌ఎన్‌ఎల్‌కు అవసరమైన పరిజ్ఞానమున్నా పక్కనబెట్టడంతో, ఐదేళ్ల నుంచీ నష్టాల్లోకి వెళ్లిపోయిందన్నారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ చీఫ్‌ పాట్రన్‌ విఎఎన్‌ నంబూద్రి మాట్లాడుతూ బిఎస్‌ఎన్‌ఎల్‌ పరిరక్షణ కోసం ఫిబ్రవరి 25న చలో పార్లమెంట్‌ చేపట్టి, ప్రజల నుంచి సేకరించిన కోటి సంతకాలతో ప్రధానికి వినతిపత్రం అందజేస్తామన్నారు. మార్చి 17 నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నామన్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో బిఎస్‌ఎన్‌ఎల్‌ అంశం మాట్లాడతానని రాజమండ్రి పార్లమెంట్‌ సభ్యుడు మాగంటి మురళీమోహన్‌ చెప్పారు. ప్రభుత్వాలు ప్రైవేట్‌ సంస్థలకు కొమ్ముకాయడం విచారకరమని రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఎపి సర్కిల్‌ అధ్యక్షుడు మోహనరెడ్డి అధ్యక్షత వహించిన సభలో రాజమండ్రి అర్బన్‌ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, మేయర్‌ పంతం రజనీశేషసాయి, కార్యదర్శి జె.సంపతరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.అభిమన్యు, జాతీయ ఉపాధ్యక్షుడు పి.అశోక్‌బాబు, ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.మహేశ్వరరావు, వర్కింగ్‌ కమిటీ ఛైర్మన్‌ వై.వెంకటేశ్వరరావు, అధ్యక్షులు ఐ.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలకు చెందిన సుమారు రెండు వేల మంది ప్రతినిధులు హాజరయ్యారు. ప్రారంభ సభ అనంతరం రాజమండ్రిలో భారీ ప్రదర్శన నిర్వహించారు.ప్రైవేటు వైద్యపరీక్షలు విరమించుకోవాలి యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ డిమాండ్‌
Posted on: Mon 19 Jan 23:41:42.437994 2015

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో
                ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను ప్రైవేటు పరం చేయడం దారుణమని అటువంటి ప్రయత్నాలను మానుకోవాలని యునైటెడ్‌ మెడిక ల్‌ అండ్‌ హెల్త్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ( సిఐటియు ) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేస్తామన్న ప్రభుత్వం వైద్య పరీక్షలను ప్రైవేటు పరం చేయడం సరైంది కాదని, ఇలా చేయడం ప్రభుత్వం తన బాధ్యత నుంచి వైదొలగడమే అవు తుందనిఆయూనియన్‌ గౌరవాధ్యక్షలు ఎవి నాగే శ్వరరావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తాళ్ళూరి వెంకటేశ్వర్లు, వలివెల శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. భవిష్యత్తులో డబ్బు చెల్లించిన వారికే వైద్య పరీక్షలు అందించే విధానం కోసమే ఈ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ విధానంలో పనిచేస్తున్న ల్యాబ్‌ టెక్నీషియన్లను రెగ్యులరైజ్‌ చేయాలని, ఉన్న ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌, అల్ట్రాసౌండ్‌ తదితర 72 రకాల వైద్య పరీక్షలను ప్రభుత్వ సిబ్బందితోనే నిర్వహంచాలని కోరారు. చిత్తూరు చక్కెర కర్మాగారం మూత
Posted on: Sun 18 Jan 02:08:07.518374 2015

- 463 కార్మికులు తొలగింపు
ప్రజాశక్తి- చిత్తూరు ప్రతినిధి
      చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ మూత పడింది. బకాయిలు చెల్లించకపోవడంతో రైతు లెవ్వరూ చెరుకు తోలకపోవడం, దీన్ని సాకుగా చూపించి నష్టాలున్నాయనే సాకుతో ఇందులో పని చేస్తున్న 463 కార్మికులను తొలగిస్తూ పాలక వర్గం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని సంక్రాంతి పండుగ తరువాత పనిలోకి వెళ్లిన కార్మికులకు యాజమాన్యం చెప్పడంతో ఆయా కుటుంబాలు వీధిన పడ్డట్టయ్యింది. చిత్తూరు జిల్లాలో లక్షల మంది రైతులకు ఆదరువుగా ఉన్న ఈ ఫ్యాక్టరీ మూత పడడంతో అన్నదాతల కష్టాలు ప్రారంభం కానున్నాయి.
చిత్తూరు జిల్లా చెరకు రైతులకు చిత్తూరు సహకార చక్కెర కర్మాగారం కల్పతరువుగా ఉంది. రాష్ట్రంలో మెదక్‌ జిల్లా ఫ్యాక్టరీ తరువాత ఇది రెండో స్థానంలో ఉంది. దీనికి 13 వేల మంది రైతులు షేర్‌ హోల్డర్లుగా ఉన్నారు. ప్రయివేటు ఫ్యాక్టరీల దోపిడీ నుంచి రైతులను కాపాడడంలో ఇది ముందంజలో ఉంది. జిల్లాలో మూడు ప్రయివేటు, రెండు సహకార రంగంలో ఉన్నాయి. ప్రతి ఏటా చెరకు మద్దతు ధర ప్రకటించాలంటే చిత్తూరు ఫ్యాక్టరీవైపే మిగిలినవన్నీ చూస్తుంటాయి. ఇది ధరను నిర్ణయించిన తరువాత దాని కనుగుణంగా మిగిలిన ప్రయివేటు ఫ్యాక్టరీలు కూడా ప్రకటిస్తాయి. ఇంతగా ఇది ప్రాముఖ్యత సంపాదించుకుంది.