28, సెప్టెంబర్ 2012, శుక్రవారం


ప్రజాస్వామ్యంలో బంద్‌లు, సమ్మెలు, సముచితమేనన్న సుప్రీంకోర్టు

Tue, 23 Mar 2010, IST    aa
ధనుంజయ మహాపాత్ర
ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మనోభావాలను వ్యక్తం చేసేందుకు 'బంద్‌' లన్నవి ఒక సాధనం అని సుప్రీంకోర్టు 2009 ఫిబ్రవరి 3న వెలువరించిన తీర్పులో పేర్కొంది.1997 నుండి న్యాయవ్యవస్థ అనుసరిస్తూ వచ్చిన వైఖరిని ఇది తిరగరాసింది. 1997లో బలవంతంగా మూసివేయడాలపై, వాటివల్ల ప్రజలకు వాటిల్లుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుంటూ రాజకీయపార్టీలపై సుప్రీంకోర్టు విరుచుకుపడింది.
కొట్టొచ్చినట్లు కనబడే ఈ వైఖరిలో మార్పు మరింత స్పష్టంగా కనబడుతోంది. ఈ తాజా వైఖరిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌ అధ్యక్షతన గల ధర్మాసనం వివరించింది. 1997లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) కేరళ హైకోర్టు తీర్పులో భాగస్వామిగా ఉన్నారు. అది అప్పుడు బంద్‌లకు వ్యతిరేకంగా చారిత్రాత్మక తీర్పు నిచ్చింది. ఆ తీర్పును సుప్రీంకోర్టు ధ్రువీకరించింది. ఈ వైఖరిని అనుసరించేందుకు ఇతర హైకోర్టులకు మార్గదర్శకమైంది. బంద్‌లకు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్‌ను కోర్టు ఫిబ్రవరి 16న విచారణకు ఆదేశించింది. అయితే ఫిబ్రవరి 3న, సిజెఐ నేతృత్వంలో, న్యాయమూర్తులు పి.సదాశివం, జె.ఎం.పాంచాల్‌లతో కూడిన ధర్మాసనం ''ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికీ తమ భావాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడింది. బంద్‌కు వ్యతిరేకంగా న్యాయస్థానం తీసుకున్న వైఖరితో ఎన్నడూ సమ్మతించని రాజకీయ పార్టీలు ఇప్పుడు తాజా వైఖరితో సంతృప్తిని ప్రకటిస్తున్నాయి. ఫిర్యాది జె.సంతోష్‌కుమార్‌ తరఫున హాజరైన అజిత్‌ పుదుస్సేరి, 1997 సుప్రీంకోర్టు తీర్పును ఉటంకించినపుడు ధర్మాసనంలో ఎటువంటి కదలికా కనబడలేదు.
వివిధ రాజకీయ పార్టీల ఛాత్ర సంస్థ అయిన ''శ్రీలంక తమిళుల రక్షణ ఉద్యమం'' బంద్‌ పిలుపు నిచ్చిందని, అది బంద్‌లకు వ్యతిరేకంగా కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును, దానిని సమర్థించిన సర్వోన్నత న్యాయస్థాన తీర్పును ఉల్లంఘించడమే అవుతుందని పుదుస్సేరి వాదించారు.
అయితే ఈ ధోరణి పనిచేయలేదు ''సమ్మెలను ఆపడంతో ఈ కోర్టుకేం పని? '' భారతదేశం ఒక ప్రజాస్వామిక దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరికీ తమ భావాలను వ్యక్తీకరించుకొనే స్వేచ్ఛ ఉంద''ని ధర్మాసనం వ్యాఖ్యానించింది. చుట్టూ తిరిగి మళ్ళీ మొదటికొచ్చింది. 1997లో ఇచ్చిన తీర్పులో హై కోర్టు ఇలా వ్యాఖ్యానించింది.
ఏదైనా పరిశ్రమను, లేదా వ్యాపారాన్ని ఏ రాష్ట్రంలోనైనా లేదా దేశంలో స్తంభింపచేసే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదా సంస్థకు ఉందని చెప్పే అవకాశం లేదు. తమ వైఖరి విభేదించే పౌరులను వారి ప్రాథమిక హక్కులను వినియోగించుకోకుండా, లేదా స్వప్రయోజనాలనిమిత్తం లేదా రాష్ట్ర లేదా దేశ ప్రయోజనాల నిమిత్తం వారి విధులను వారు నిర్వర్తించకుండా నిరోధించే హక్కు లేద''ని తేల్చిచెప్పింది.
''ఇలా చెప్పడం అనుచితం, ఒక రాజకీయ పార్టీ లేదా అందులోని సభ్యులుగాని చట్టబద్ధంగా వినియోగించుకోగల ఒక ప్రాథమిక హక్కుగా ఆమోదించలేము''.
ఈ తీర్పు పట్ల దేశ వ్యాపితంగా లక్షలసంఖ్యలో వున్న ప్రజలు తమ హర్షాతిరేకాలు వెలిబుచ్చారు.

2012 ఫిబ్రవరి 28న కేంద్ర కార్మిక సంఘాలన్నీ సంయుక్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆ స్థాయిలో జరిగే సమ్మెల్లో ఇది పద్నాలుగోవది. ఈ సమ్మెకు అనేక విధాలుగా ప్రాధాన్యత సంతరించుకుంది. భావసారూప్యతలో తేడాలున్నా ఐక్యంగా పోరాడాలన్న అవసరాన్ని గుర్తించడంలో జాతీయస్థాయి నాయకత్వాల పురోగమనం ఫలితంగా కార్మికుల్లో కనిపించే నూతనొత్తేజం, విశాల ఐక్యత ద్వారా సంఖ్యరీత్యా మరింత ఎక్కువ పాల్గొనే అవకాశం.. చూస్తుంటే ఫిబ్రవరి 28సమ్మె దేశ కార్మికవర్గ పోరాటాల చరిత్రలో ముందడుగుగా నిలుస్తుంది.
దీర్ఘకాలం జరిగిన రంగాలవారి సమ్మెలు చరిత్రలో ఉన్నాయి. బొంబాయి టెక్‌టైల్స్‌ సమ్మె ఆరేళ్ళపాటు జరిగింది. రాష్ట్ర ఉద్యోగుల సమ్మె 156 రోజుల పాటు సాగింది. కీలకమైన రైల్వే, ఎయిర్‌లైన్స్‌ సమ్మెలు జరిగాయి. ప్రభుత్వం ఈ సమ్మెలన్నింటిపట్ల వ్యవహరించినదానికీ, 1982 జనవరి 19న మొట్టమొదటి ఆలిండియా సమ్మె ఒక్కరోజు మాత్రమే జరిగినా దానిపై వ్యవహరించిన తీరులో తేడాను గమనించవచ్చు. 1981 జూన్‌ 4న జాతీయ కార్మిక సంఘాల సదస్సులో ఒక రోజు సమ్మె నిర్ణయం జరిగిన వెనువెంటనే జులై 27న అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్‌(ఇఎస్‌ఎంఓ) కేంద్రం తెచ్చి ఎదురుదాడి ప్రారంభించింది. అంతేకాదు సమ్మె సన్నాహక కార్యక్రమాలు దేశమంతటా జరిగే క్రమంలోనే సమ్మెను విఫలం చేయడానికి, భగం చేయడానికి యత్నాలు తన యంత్రాంగం ద్వారా చేసింది. ఒక ఆంధ్రప్రదేశ్‌లో మూడు వేల మందిని అరెస్టు చేసింది. సమ్మె చారిత్రకంగా అపూర్వమైంది. రైతుకు గిట్టుబాటు ధర, కార్మికులకు బోనస్‌ హక్కు, ధరలు, ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టీకరణ ప్రధాన డిమాండ్లు. విశేషమేమంటే నేటి ఫిబ్రవరి 28 సమ్మెలోనూ ఆ డిమాండ్లే ప్రధానంగా ఉన్నాయి. బోనస్‌ హక్కు స్థితివేరుగా ఉంది. నాడు ఐఎన్‌టియుసి సమ్మెలో లేదు. తర్వాత రాజ్యాంగంలో 310, 311(2)బి అధికరణలపై రాష్ట్ర ఉద్యోగుల ఒకరోజు జాతీయ సమ్మె పెద్దఎత్తున జరిగింది. 1986 ఫిబ్రవరి 26న ప్రధానిగా రాజీవ్‌ ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలపై, ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించే యత్నాలకు వ్యతిరేకంగా, ధరల సూచిపై సీల్‌ కమిటీ సిఫార్సులపైనా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుపై 1987 జనవరి 21న ఒక రోజు సమ్మె జరిగింది. ఐఎన్‌టియుసి పిలుపు చేరలేదు. దాని అనబంధ సంఘాలు అనేక చోట్ల పాల్గొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతనసవరణ ప్రక్రియల్లో బ్యూరోఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌(బిపిఇ) జోక్యానికి వ్యతిరేకంగానూ, కార్మిక చట్టాల్లో సవరణ తెచ్చి, వైద్య, విద్యా రంగాల్లో ట్రేడ్‌ యూనియన్‌ హక్కును నిరాకరించే యత్నాలకు వ్యతిరేకంగా 1988 మార్చి 15న జరిగిన ఒక్క రోజు సమ్మెలో ఐఎన్‌టియుసిలో దారావర్గం కలిసొచ్చింది. ఆ రోజున వామపక్షాలు బంద్‌ నిర్వహించి మద్దతుగా నిలిచాయి. మూసివేతలు, లాకౌట్లకు వ్యతిరేకంగానూ, భోఫోర్స్‌ అవినీతిలో దోషిగా ఉన్న రాజీవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, 1989 ఆగస్టు 30న కేంద్ర కార్మిక సంఘాలు, జులై 12న కమిటీ కలిసి సమ్మె నిర్వహించాయి. రాజీవ్‌ ఓటమి అనంతరం విపి.సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలహీనంగా నడిచినా, పనిచేసే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్న డిమాండ్‌ను సూత్రప్రాయంగా అంగీకరించడం ప్రాధాన్యత కలిగిన అంశం.
సోవియట్‌ యూనియన్‌ పతనం, రాజీవ్‌ హత్య, అనంతరం జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పివి.నరశింహరావు ప్రభుత్వం తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాన్ని దివాలాదిశలో భ్రష్టుపట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా 1991-94 ఈ నాలుగు సంవత్సరాల్లో కేంద్ర కార్మిక సంఘాల స్పాన్సరింగ్‌ కమిటీ పిలుపుపై నాలుగు ఆలిండియా సమ్మెలు జరిగాయి. కాంగ్రెస్‌ అనుకూల ఐఎన్‌టియుసిగానీ, 1991-92 కాలంలో బాబ్రీ మషీదు పరిణామాల నేపథ్యంలో బిఎంఎస్‌గానీ ఈ సమ్మెల్లో పాల్గొనలేదు. అనంతర పరిస్థితుల్లో 56 ప్రజాసంఘాల జాతీయ వేదిక ఏర్పడింది. సరళీకృత ఆర్థిక విధానాలపై వ్యతిరేకత, మతసామరస్య పరిరక్షణ


సమ్మెలు, లాకౌట్ల వల్ల 50 లక్షల పనిదినాలు నష్టం

న్యూఢిల్లీ, మార్చి 17: దేశంలో గత సంవత్సరం సమ్మెలు, లాకౌట్ల వల్ల వివిధ సంస్థలలో 5 మిలియన్ల పనిదినాలు వృథా కాగా 61 యూనిట్లు మూతపడ్డాయి. సుమారు 2200 మంది కార్మికులు వీథిన పడ్డారని ఒక అధికారిక సమాచారం వెల్లడించింది. దేశంలోని ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో గత సంవత్సరం కొన్ని పారిశ్రామిక వాడల్లో, ఇతర ఉత్పాదక కేంద్రాలలో సమ్మెలు, లాకౌట్ల వల్ల హెచ్చు పనిదినాలు నష్టపోయాయని లేబర్ బ్యూరో వెల్లడించింది. ఆర్థిక మాంద్యం నెలకొన్నా అంతకు ముందు సంవత్సరం కంటె గత సంవత్సరం ఉద్యోగాలు కోల్పోయిన వారి సంఖ్య తక్కువగా ఉందని తెలియచేసింది. 2008లో 3,052 మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోగా 2010 నాటికి ఈ సంఖ్య తగ్గింది. గత సంవత్సరం దేశంలో 61 యూనిట్లు మూతపడ్డాయి. దేశంలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా 22 లక్షల పనిదినాలు నష్టమయ్యాయి. తర్వాత పశ్చిమబెంగాల్‌లో 10 లక్షలు, హిమాచల్ ప్రదేశ్‌లో 5 లక్షల పనిదినాలు నష్టపోయాయని ఆ నివేదిక వెల్లడించింది. కాగా అంతకు ముందు సంవత్సరం కంటె ఇది తక్కువేనని పేర్కొంది. ఇక ఒరిస్సాలో 1354 మంది, హిమాచల్ ప్రదేశ్‌లో 665 మంది, హర్యానాలో 95 మంది ఉద్యోగాలు కోల్పోయారు.