2, నవంబర్ 2012, శుక్రవారం


దీర్ఘకాలం జరిగిన రంగాలవారి సమ్మెలు చరిత్రలో ఉన్నాయి. బొంబాయి టెక్‌టైల్స్‌ సమ్మె ఆరేళ్ళపాటు జరిగింది. రాష్ట్ర ఉద్యోగుల సమ్మె 156 రోజుల పాటు సాగింది. కీలకమైన రైల్వే, ఎయిర్‌లైన్స్‌ సమ్మెలు జరిగాయి. ప్రభుత్వం ఈ సమ్మెలన్నింటిపట్ల వ్యవహరించినదానికీ, 1982 జనవరి 19న మొట్టమొదటి ఆలిండియా సమ్మె ఒక్కరోజు మాత్రమే జరిగినా దానిపై వ్యవహరించిన తీరులో తేడాను గమనించవచ్చు. 1981 జూన్‌ 4న జాతీయ కార్మిక సంఘాల సదస్సులో ఒక రోజు సమ్మె నిర్ణయం జరిగిన వెనువెంటనే జులై 27న అత్యవసర సర్వీసుల నిర్వహణ ఆర్డినెన్స్‌(ఇఎస్‌ఎంఓ) కేంద్రం తెచ్చి ఎదురుదాడి ప్రారంభించింది. అంతేకాదు సమ్మె సన్నాహక కార్యక్రమాలు దేశమంతటా జరిగే క్రమంలోనే సమ్మెను విఫలం చేయడానికి, భగం చేయడానికి యత్నాలు తన యంత్రాంగం ద్వారా చేసింది. ఒక ఆంధ్రప్రదేశ్‌లో మూడు వేల మందిని అరెస్టు చేసింది. సమ్మె చారిత్రకంగా అపూర్వమైంది. రైతుకు గిట్టుబాటు ధర, కార్మికులకు బోనస్‌ హక్కు, ధరలు, ప్రజాపంపిణీ వ్యవస్థ పటిష్టీకరణ ప్రధాన డిమాండ్లు. విశేషమేమంటే నేటి ఫిబ్రవరి 28 సమ్మెలోనూ ఆ డిమాండ్లే ప్రధానంగా ఉన్నాయి. బోనస్‌ హక్కు స్థితివేరుగా ఉంది. నాడు ఐఎన్‌టియుసి సమ్మెలో లేదు. తర్వాత రాజ్యాంగంలో 310, 311(2)బి అధికరణలపై రాష్ట్ర ఉద్యోగుల ఒకరోజు జాతీయ సమ్మె పెద్దఎత్తున జరిగింది. 1986 ఫిబ్రవరి 26న ప్రధానిగా రాజీవ్‌ ఉన్నప్పుడు నూతన ఆర్థిక విధానాలపై, ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరించే యత్నాలకు వ్యతిరేకంగా, ధరల సూచిపై సీల్‌ కమిటీ సిఫార్సులపైనా, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుపై 1987 జనవరి 21న ఒక రోజు సమ్మె జరిగింది. ఐఎన్‌టియుసి పిలుపు చేరలేదు. దాని అనబంధ సంఘాలు అనేక చోట్ల పాల్గొన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో వేతనసవరణ ప్రక్రియల్లో బ్యూరోఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజస్‌(బిపిఇ) జోక్యానికి వ్యతిరేకంగానూ, కార్మిక చట్టాల్లో సవరణ తెచ్చి, వైద్య, విద్యా రంగాల్లో ట్రేడ్‌ యూనియన్‌ హక్కును నిరాకరించే యత్నాలకు వ్యతిరేకంగా 1988 మార్చి 15న జరిగిన ఒక్క రోజు సమ్మెలో ఐఎన్‌టియుసిలో దారావర్గం కలిసొచ్చింది. ఆ రోజున వామపక్షాలు బంద్‌ నిర్వహించి మద్దతుగా నిలిచాయి. మూసివేతలు, లాకౌట్లకు వ్యతిరేకంగానూ, భోఫోర్స్‌ అవినీతిలో దోషిగా ఉన్న రాజీవ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ, 1989 ఆగస్టు 30న కేంద్ర కార్మిక సంఘాలు, జులై 12న కమిటీ కలిసి సమ్మె నిర్వహించాయి. రాజీవ్‌ ఓటమి అనంతరం విపి.సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం బలహీనంగా నడిచినా, పనిచేసే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించాలన్న డిమాండ్‌ను సూత్రప్రాయంగా అంగీకరించడం ప్రాధాన్యత కలిగిన అంశం.
సోవియట్‌ యూనియన్‌ పతనం, రాజీవ్‌ హత్య, అనంతరం జాతీయ, అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో పివి.నరశింహరావు ప్రభుత్వం తెచ్చిన సరళీకృత ఆర్థిక విధానాలు దేశాన్ని దివాలాదిశలో భ్రష్టుపట్టిన సంస్కరణలకు వ్యతిరేకంగా 1991-94 ఈ నాలుగు సంవత్సరాల్లో కేంద్ర కార్మిక సంఘాల స్పాన్సరింగ్‌ కమిటీ పిలుపుపై నాలుగు ఆలిండియా సమ్మెలు జరిగాయి. కాంగ్రెస్‌ అనుకూల ఐఎన్‌టియుసిగానీ, 1991-92 కాలంలో బాబ్రీ మషీదు పరిణామాల నేపథ్యంలో బిఎంఎస్‌గానీ ఈ సమ్మెల్లో పాల్గొనలేదు. అనంతర పరిస్థితుల్లో 56 ప్రజాసంఘాల జాతీయ వేదిక ఏర్పడింది. సరళీకృత ఆర్థిక విధానాలపై వ్యతిరేకత, మతసామరస్య పరిరక్షణ