23, డిసెంబర్ 2011, శుక్రవారం


ఇది నిరసన నామ సంవత్సరం
అది నిరీక్షణ ఫలించే కొత్త వత్సరం
ఇది నిరంతర ఆక్రమణల సంవత్సరం
అది కొత్త జీవితం ప్రసాదించే నవవత్సరం

9, నవంబర్ 2011, బుధవారం

సఫలతకి పెద్ద అడ్డంకి ఓటమికి భయపడటమే

maikaviski

విద్యత్కిరణాలు
       ఉక్కును తినేసినట్లు 
పెట్టుబడిదారీ విధానపు 
        రోజులు నిండాయి 
అప్పుడు కాలం కడుపు తో వుంది 
         కారల్ మార్క్సు ని ప్రసవించింది 
                -           -            -

5, నవంబర్ 2011, శనివారం

తాడే పామై కరిచే వేళ
ఆయులు విషమే చిమ్మే వేళ 
లాభం కోరలు సాచే వేళ 
తిరుగుబాటు తప్పదుదీ వేళ 

4, నవంబర్ 2011, శుక్రవారం

మళ్లీ మంట పెట్టారు 
మరో సారి వంచించారు 
మరీ బరి తెగించారు 
మళ్ళా  దోచి పెట్టారు


30, అక్టోబర్ 2011, ఆదివారం

కుభేరులు-అన్నార్తులు

ప్రపంచంలోనే శీఘ్రంగా అభివృద్ధి చెందుతున్న కొద్ది దేశాల్లో ఒకటిగా ప్రశంసలందుకుంటున్న భారత దేశంలో అంతే మోతాదులో పేదరికం, దారిద్య్రం, ఆకలి కేకలూ పెరుగుతుండడం పెట్టుబడిదారీ అభివృద్ధి వికృత రూపాన్ని వెల్లడిస్తోంది. కొద్ది వారాల క్రితమే ఫోర్బ్స్‌ పత్రిక వెల్లడించిన ప్రపంచ కుబేరుల సరికొత్త జాబితాలో భారతీయ కుబేరుల సంఖ్య 24 నుండి అమాంతం 52కు పెరిగింది. ఏడాదిలో 100 శాతం పైగా కుబేరులు పెరిగారన్న వార్త వెనువెంటనే మన దేశం మానవాభివృద్ధి సూచిలో 126 స్థానం నుండి 134 స్థానానికి దిగజారిందన్న విషయం కూడా వెల్లడైంది. 2004లో మన దేశంలో శతకోటీశ్వరులు (వందకోట్ల డాలర్లకు పైగా ఆస్థి ఉన్నవారు లేక కనీసం 5000 కోట్ల రూపాయలకు తక్కువ కాకుండా ఉన్న వారు) 9 మంది కాగా వారి సంఖ్య ఆరేళ్ల కాలంలో ఆరు రెట్లు పెరిగింది. కాని ఇదే కాలంలో నిష్ట దరిద్రుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అధికార నివేదికలే తెలియజేస్తున్నాయి. 2009-మానవాభివృద్ధి నివేదిక ప్రపంచంలోని మొత్తం 184 దేశాల జాబితా ప్రకటించగా వాటిలో భారత్‌ 134వ స్థానంలో ఉంది. అంతకు ముందుటేడాది 126 స్థానంలో ఉండేది కాస్తా మరింత దిగజారింది. దేశాభివృద్ధి గురించి గొప్పలు చెప్పుకుంటున్న పాలకులూ, పాలక వర్గ మీడియా... ఎందుకు మన దేశంలో ఈ అభివృద్ధి మధ్యలోనే పేదరికం ఇంతగా పెరగుతున్నదో ఎన్నడూ చర్చకు పెట్టవు. దేశంలో నూటికి 80 శాతం ప్రజలు నేటికీ రోజుకు 20 రూపాయల ఆదాయంతో బ్రతుకీడుస్తున్నారని గతేడాది కార్మిక శాఖ జరిపిన సర్వేలో తేలింది. చివరికి మనం దేశంలో పేదరికం అంచనాలను అతి తక్కువగా చేసిచూపుతున్న ప్రణాళికా సంఘం కూడా తప్పు సవరించుకుని పేదరికం లెక్కలను కొంతమేరకైన పెంచి చూపించాల్సిన అగత్యం ఏర్పడింది. భారతీయ కుభేరులు అంతర్జాతీయ స్థాయిలో పోటీపడుతుంటే మరోవైపు పేదరికంలో మన దేశం ప్రపంచలోనే అత్యం నిరుపేద ప్రాంతమైన సహారా దిగువ దేశాలతో పోటీ పడుతోంది. దేశంలో జరుగుతున్న ఈ రకమైన వికృత అభివృద్ధికి ప్రభుత్వ విధానాలే కారణమన్నది సుస్పష్టం. నేల, నీరు, గనులు, ప్రజా సంపద మొత్తం బడాబాబులకు అప్పనంగా కట్టబెడున్న ప్రభుత్వ విధానాలు, శ్రామికుల శ్రమశక్తిని దోపిడీ చేసుకోడానికి సంపన్నులకు నిర్నిరోధమైన అవకాశాలు కల్పిస్తున్న విధానాలు, హక్కుల కోసం పోరాడే శ్రామిక జన ఉద్యమాలపై ఉక్కుపాదం మోపే విధానాలు అనుసరిస్తున్న ప్రభుత్వం...అదే ప్రభుత్వం మరోవైపు పేద, సామాన్య ప్రజలు వినియోగించే నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతోంది. వారి నిజవేతనాలకూ, ఉద్యోగభద్రతకూ కోతపెడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రతి బడ్జెట్టూ ధనికులకు మరిన్ని రాయితీలు ఇస్తున్నాయి, పేదలకు ఇచ్చే సబ్సిడీలు, సంక్షేమ కార్యక్రమాలకు కోతపెడుతున్నాయి. ఈ విధానాలను ఇలా కొనసాగనిస్తే అభివృద్ధి బాగానే ఉంటుంది, కుభేరుల సంఖ్య ఇంకా పెరుగుతుంది, కాని పేద, సామాన్య ప్రజల బ్రతుకులు మాత్రం మరింత దుర్భరమవుతాయి. అసమానతలు మరింత తీవ్రమవుతాయి. సంక్షోభం మరింత ముదురుతుంది. ప్రజా పోరాటాలు మాత్రమే ఈ దుష్పరిణామాలకు అడ్డుకట్ట వేయగలవు.

26, అక్టోబర్ 2011, బుధవారం

దీపావళి శుభాకాంక్షలు 
నేరవేరుని  ప్రజల ఆకాంక్షలు 
ఎంతకాలమి ఆంక్షలు 
శ్రమ దోపిడీ దారులకు శిక్షలు 

22, అక్టోబర్ 2011, శనివారం

తాడూ బొంగరం లేని తిరుగుబాటు దళాల చేతిలో ఇప్పటికే లిబియా కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. లూటీలు రాజ్యమేలుతున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌ ఏ విధంగా ఆటవిక స్థితిలోకి దిగజారిపోయిందో గడాఫీ అనంతర లిబియా కూడా అంత అగమ్యంగా మారే అవకాశముంది. అప్పుడు అమెరికా కూటమి మరింత బాహాటంగా తలదూరుస్తుంది. ఇప్పటికే అక్కడ లాభాలు పోగుపోసుకోవడానికి బ్రిటన్‌,ఫ్రాన్స్‌లు ఆదరాబాదరాగా వున్నాయని రాయిటర్స్‌ కథనం. గతంలో రష్యా, చైనా, బ్రెజిల్‌ దేశాలతో గడాఫీ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి ఆ సంపదను తమ అదుపులోకి తెచ్చుకోవడమే వాటి లక్ష్యం. గడాఫీ మంచి చెడ్డలు ఏమైనా అది లిబియా అంతర్గత వ్యవహారం. ఆ ప్రజలే నిర్ణయించుకోవాలి. అమెరికా నాటోల దుర్మార్గమైన జోక్యాన్ని గనక ఈ విధంగా సాగనిస్తే రేపు అన్ని దేశాల సార్వభౌమత్వాలకూ ముప్పు తప్పదు. గడాఫీ నియంత అనేవారు ప్రపంచ నియంత పైశాచికత్వాన్ని చూడకపోతే అది ప్రపంచమంతటికీ ప్రమాదం. 

19, అక్టోబర్ 2011, బుధవారం

సకల జనుల సమ్మె నేపథ్యంలో ఆర్టీసి, సింగరేణి తదితర సంస్థల ప్రైవేటీకరణ ప్రమాదం పొంచి ఉందని రాఘవులు వ్యాఖ్యానించారు. ' గతంలో చంద్రబాబు, వైఎస్‌ పలు సంస్థల ప్రైవేటీకరణ కార్యక్రమాన్ని అమలు చేయలేకపోయారు. తాజా సమ్మె నేపథ్యంలో ఆ ప్రమాదం ముంచుకొచ్చింది. సమ్మె వల్ల కలిగిన నష్టాలను పూడ్చుకునే పేరుతో, ఆర్టీసి, సింగరేణి సంస్థల్లో ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంతం చేసే అవకాశం ఉంది. కార్మికుల మధ్య ప్రస్తుతమున్న అనైక్యతను యాజమాన్యాలు ఉపయోగించుకుంటాయి. కార్మికులు కూడా ప్రైవేటీకరణ వంటి ముఖ్యమైన సమస్యలపై కాకుండా, ఇతర సమస్యలపై ఆందోళనలు నిర్వహించడం...యాజమాన్యాలకు ఉపకరించే పరిణామం...'