31, అక్టోబర్ 2017, మంగళవారం

కే ఏ పాల్

మే 21, 2012: నాదేవుడు, నా వెంటే ఉంటాడు, నా వెనుకాలే తిరుగుతాడు, నాతో పెట్టుకుంటే సర్వ నాశనం అయిపోతారు ఇలా ఆడవారిలా డైలాగులు చెప్పే క్రైస్తవ మతస్థుడు కే ఏ పాలు.
వీడు మన రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా పేరు పడ్డ గొప్ప మతబోధకుడు. తాజాగా ప్రజా శాంతి పార్టీ ని స్థాపించి ఎన్నికల రంగంలో తన అభ్యర్ధులను కూడా నిలబెట్టాడు. ప్రపంచంలో అనేక దేశాలు తిరిగాడు, అనేక అంతర్జాతీయ సంస్థలతో సంభంధాలు కల వ్యక్తి.
తాజాగా రెండు రోజులక్రితం పాల్ ను అరెస్టు చేశారు ఒంగోలు పోలీసులు. దీనివెనుక అసలు కారణం ఏమిటంటే..
సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం కే ఏ పాల్ తమ్ముడు డేవిడ్ రాజు దారుణంగా హత్యకు గురయ్యాడు. ఆ సందర్భంగా పోలీసులు డేవిడ్ హత్య చేసిన వారిని అరెస్టు చేసి జైలుకు పంపారు. డేవిడ్ ను చంపిన వారిలో స్వయంగా డేవిడ్ కొడుకు కూడా ఉన్నాడు.
అందరూ అప్పట్లో డేవిడ్ హత్య వెనుక కే ఏ పాల్ పాత్ర ఉందని భావించినా తగిన ఆధారాలు దొరక లేదు. ఇక 2012 ఇప్పటి అరెస్టు విషయానికి వస్తే … ఒంగోలు ఉప ఎన్నికల ప్రచారానికి వచ్చిన పాల్ రెండు రోజుల క్రితం తనను ఎవరో అనుకరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు పాల్. ఈ ఫిర్యాదు పై అత్యంత గోప్యంగా పరిశోధన చేసిన పోలీసులు పాల్ ను అనుసరిస్తున్న కోటేశ్వరరావు, మరొక వ్యక్తిని అరెస్టు చేశారు.
ఆ ఇద్దరి వద్దనుంచి కొన్ని సి‌డి లను స్వాధీనం చేసుకున్నారు. ఆ సి‌డి లలో సంభాషణ విన్న పోలీసులు దిగ్భ్రాంతి కలిగింది. అందులో పాల్ స్వయంగా తన తమ్ముడు డేవిడ్ పాల్ హత్య గురించి ఇతరులతో ప్లాన్ వేస్తున్న సంభాషణ రికార్డ్ అయ్యిఉంది.
దీనిని పోలీసులు విని పాల్ ను అరెస్టు చేశారు.
ఈ విషయం తెలుసుకున్న పాల్ ఏకంగా ఒంగోలు పోలీసు సి‌ఐ కి కోటి రూపాయలు లంచం ఇస్తానని, కోటేశ్వరరావు మరో వ్యక్తి ని చంపేయండని అన్నాడు. మీరు చంపలేక పోతే ఊరి బయట నా మనుషులు ఉంటారని వారికి వీరిద్దరిని అప్పగించమని కోరాడు. ఇందు మేరకు పోలీసులకు 3 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చాడు పాల్. దీనినంతా పోలీసులు కేమారాలో చిత్రీకరించారు.
ఇక అరెస్టయిన తరువాత ఇదంగా జగన్, కిరణ్ కుమార్ రెడ్డి కుట్రలో భాగం అని పాల్ వాదిస్తున్నాడు.
ప్రజా శాంతి పార్టీ పెట్టి రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పుతానని చెప్పిన క్రైస్తవ మత ప్రచారకుడు కెఎ పాల్ జీవితం విషాదకరమైన మలుపు తిరిగింది. గుంటూరులో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, జిల్లాలోని పత్తిపాడు, మాచర్ల శానససభా నియోజకవర్గాలకు ఆయన సోమవారం అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటించాల్సి ఉంది. ఇందుకు గుంటూరులో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ స్థితిలో ఆయన పోలీసులకు చిక్కారు.

తమ్ముడు డేవిడ్ రాజు హత్య జరిగి రెండేళ్లయిన తర్వాత పాల్ ఎలా పోలీసులకు చిక్కాడనేది, ఆయనపై పోలీసులకు ఎలా సాక్ష్యాలు దొరికాయనేది ఆసక్తికరంగా మరింది. డేవిడ్ రాజు హత్య కేసులో కెఎ పాల్ సుపారీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం తెల్లవారు జామున ఆయనను అరెస్టు చేసిన తర్వాత ఆయనకు రిమ్స్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, ఇంటి వద్ద మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. ఆయనకు జిల్లా న్యాయమూర్తి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను పోలీసులు జిల్లా జైలుకు తరలించారు.

కెఎ పాల్‌ది విజయనగరం జిల్లా నెల్లమర్ల మండలం సారిపల్లి గ్రామం. డేవిడ్ రాజుకు, పాల్‌కు మధ్య భోగాపురంలోని గీంసిటీకి సంబంధించిన వివాదం చెలరేగినట్లు తెలుస్తోంది. డేవిడ్ రాజు కుమారుడు సాల్మన్ రాజు ప్రేమ వివాహం కూడా ఓ కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. సాల్మన్ రాజు ప్రేమ వివాహాన్ని డేవిడ్ రాజు వ్యతిరేకించారని అంటారు. డేవిడ్ రాజుతో మిగతా కొంత మంది కలిసి హైదరాబాదులోని అమీర్‌పేటలో గల వైట్‌హౌస్ లాడ్జిలో ఆ వివాదాన్ని పరిష్కరించేందుకు సమావేశమయ్యారని తెలుస్తోంది.

వైట్ హౌస్‌ నుంచి డేవిడ్ రాజు కారులో బయలుదేరినట్లు తెలిసింది. అతనితో పాటు ఉన్నవారు మార్గమధ్యంలో ఆయనను హత్య చేసి మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి గ్రామం వద్ద కారులో అతన్ని వదిలేసినట్లు చెబుతున్నారు. ఈ కేసులో పోలీసులు 2010 ఫిబ్రవరిలో 8 మందిని అరెస్టు చేశారు. డేవిడ్ రాజు హత్య కేసులో కోటేశ్వర రావు అనే వ్యక్తి కూడా నిందితుడని చెబుతున్నారు. కోటేశ్వర రావు ఇటీవలి కాలంలో పాల్‌ను బ్లాక్ మెయిల్ చేస్తూ వస్తున్నాడని అంటున్నారు.

కోటేశ్వర రావుపై కెఎ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు అతడ్ని ప్రశ్నించడంతో డేవిడ్ రాజు హత్యలో పాల్ ప్రమేయం బయటపడిందని చెబుతున్నారు. డేవిడ్ రాజు హత్యలో తన ప్రమేయాన్ని కోటేశ్వర రావు అంగీకరిస్తూ అన్ని విషయాలు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు పాల్‌ను అరెస్టు చేశారని అంటున్నారు. పాల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని కోటేశ్వర రావు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. కోటేశ్వర రావు ద్వారానే పాల్ పట్టుబడినట్లు దీన్ని బట్టి అర్థమవుతోంది.

ఏలూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు, క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ కుమార్‌ల అవినీతి కార్యకలాపాలను త్వరలోనే తాను బయటపెడతానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, సువార్త ప్రచారకుడు కిలారి ఆనంద్ పాల్(కెఏ పాల్) ఆదివారం అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విలేకరులతో మాట్లాడారు.

జగన్, అనిల్ కుమార్‌లు తనను ఎలా ఇబ్బంది పెట్టారో, ఎంతలా ఇబ్బందులకు గురి చేశారో త్వరలో ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పారు. తనకు తీవ్ర ఆర్థిక నష్టాన్ని వారు కలిగించారని ఆరోపించారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన అవినీతిదారుణమైనదిగా అభివర్ణించారు. ఆయన హయాంలో తనకు జరిగిన అన్యాయం ఆషామాషీ కాదన్నారు.

2007లో వైయస్‌కు లంచం ఇవ్వకపోవడం వల్లనే తనపై కక్ష పెంచుకొని ఆర్థికంగా దెబ్బతీయడానికి ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఉప ఎన్నికలలో ప్రజాశాంతి పార్టీ అయిదు స్థానాల నుంచి పోటీ చేస్తుందని ఆయన చెప్పారు. నరసాపురం, రామచంద్రాపురం, పాయకరావుపేట, ప్రత్తిపాడు, ఒంగోలు స్థానాల నుండి అభ్యర్థులను బరిలోకి దింపుతామని చెప్పారు.

కాగా ఒంగోలులో సమావేశం పెట్టవద్దని జగన్ పార్టీ నేత నుండి బెదిరింపులు వస్తున్నాయని ఆయన గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. తాము ఉప ఎన్నికల బరిలోకి దిగుతున్నామని స్పష్టం చేశారు. ఒంగోలు సభను అడ్డుకుంటామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల నుండి బెదిరింపులు వస్తున్నాయని, ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదని చెప్పారు. మీటింగ్ అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పారు.

అవినీతికి పాల్పడిన వారు జైలు పాలవడం ఖాయమని కెఏ పాల్ అంతకుముందు అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తుంటే అన్ని రాజకీయ పార్టీలు అవినీతిలో కూరుకు పోయినట్లుగా కనిపిస్తోందన్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో తమ ప్రజాశాంతి పార్టీ తరఫున రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో పోటీ చేస్తామని ఆయన చెప్పారు.

త్వరలో జరగనున్న పద్దెనిమిది అసెంబ్లీ, ఒక పార్లమెంటు నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టే విషయంపై పార్టీలో చర్చిస్తున్నామని అప్పుడు చెప్పారు. ప్రస్తుతం ఉప ఎన్నికలు జరగబోయే నియోజకవర్గాలలో కొన్నిచోట్ల ప్రజాశాంతి పార్టీ తరఫున అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు.