22, అక్టోబర్ 2011, శనివారం

తాడూ బొంగరం లేని తిరుగుబాటు దళాల చేతిలో ఇప్పటికే లిబియా కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. లూటీలు రాజ్యమేలుతున్నాయి.ఆఫ్ఘనిస్తాన్‌ ఏ విధంగా ఆటవిక స్థితిలోకి దిగజారిపోయిందో గడాఫీ అనంతర లిబియా కూడా అంత అగమ్యంగా మారే అవకాశముంది. అప్పుడు అమెరికా కూటమి మరింత బాహాటంగా తలదూరుస్తుంది. ఇప్పటికే అక్కడ లాభాలు పోగుపోసుకోవడానికి బ్రిటన్‌,ఫ్రాన్స్‌లు ఆదరాబాదరాగా వున్నాయని రాయిటర్స్‌ కథనం. గతంలో రష్యా, చైనా, బ్రెజిల్‌ దేశాలతో గడాఫీ కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసి ఆ సంపదను తమ అదుపులోకి తెచ్చుకోవడమే వాటి లక్ష్యం. గడాఫీ మంచి చెడ్డలు ఏమైనా అది లిబియా అంతర్గత వ్యవహారం. ఆ ప్రజలే నిర్ణయించుకోవాలి. అమెరికా నాటోల దుర్మార్గమైన జోక్యాన్ని గనక ఈ విధంగా సాగనిస్తే రేపు అన్ని దేశాల సార్వభౌమత్వాలకూ ముప్పు తప్పదు. గడాఫీ నియంత అనేవారు ప్రపంచ నియంత పైశాచికత్వాన్ని చూడకపోతే అది ప్రపంచమంతటికీ ప్రమాదం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి