13, జులై 2012, శుక్రవారం


ఐరాస మానవాభివృద్ధి సూచీలో 134వ స్థానంలో భారత్

న్యూఢిల్లీ, నవంబర్ 2: ఐక్యరాజ్య సమితి మానవాభివృద్ధి సూచీలో మన దేశం 187 దేశాల్లో 134వ స్థానంలో నిలిచింది. గత ఇరవై ఏళ్ల కాలంలో ప్రసూతి సమయంలో శిశువుల ఆయుః ప్రమాణాలు ఏడాదికి 10.1 శాతం చొప్పున పెరిగినట్లు ఓ వైపు ఆ సూచీ వెల్లడిస్తూ ఉన్నప్పటికీ మన దేశం ఆ సూచీలో ఇంకా అట్టడుగు స్థాయిలోనే నిలవడం గమనార్హం. యుఎన్‌డిపి రూపొందించిన 2010 సంవత్సరపు మానవాభివృద్ధి సూచీలో మన దేశం మొత్తం 169 దేశాల్లో 119వ స్థానంలో ఉండింది. అయితే గత నివేదికల్లో ప్రచురించిన విలువలు, ర్యాంకింగ్‌లతో పోల్చడం తప్పుదారి పట్టించడమే అవుతుందని, ఎందుకంటే వివరాలు, వాటిని సేకరించే విధానాలు మారిపోయాయని, అలాగే మానవాభివృద్ధి సూచీలో చేర్చిన దేశాల సంఖ్య కూడా మారిపోయిందని 2011 సంవత్సరానికి రూపొందించిన తాజా నివేదిక అభిప్రాయ పడింది. 2011 సంవత్సరానికి గాను భారత దేశ మానవాభివృద్ధి సూచీ ర్యాంక్ 0.547 గా పేర్కొన్న నివేదిక మధ్యస్థాయి మానవాభివృద్ధి కేటగిరీలో దాన్ని చేర్చింది. మన పొరుగుదేశాలయిన పాకిస్తాన్ ఈ జాబితాలో 146(0.504), బంగ్లాదేశ్ 146(0.500) స్థానాల్లో ఉన్నాయి. 1980, 2011 మధ్య కాలంలో భారత దేశ మానవాభివృద్ది సూచీ 0.344 నుంచి 0.547కు పెరిగిందని, అంటే 59 శాతం లేదా సగటున ఏడాదికి1.5 శాతం పెరిగిందని ఆ నివేదిక పేర్కొంది.
అయితే దేశ మానవాభివృద్ధి సూచీ ఇప్పటికీ మధ్యస్థాయి మానవాభివృద్ధి గ్రూపు దేశాల సగటు అయిన 0.630కన్నా, అలాగే తూర్పు ఆసియా దేశాల సగటు అయిన 0.548కన్నా కూడా తక్కువే ఉందని ఆ నివేదిక అభిప్రాయ పడింది. మానవాభివృద్ధికి సంబంధించి మూడు ప్రధాన అంశాలు అంటే దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించడం, తెలివితేటలను పెంచుకునే అవకాశాలు, మెరుగైన జీవన ప్రమాణాల ఆధారంగా మానవాభివృద్ధి సూచీని లెక్కగడ్తారు. దేశంలో పిల్లలు పాఠశాలకు వెళ్లి చదువుకునే సంవత్సరాలు 1980నుంచి 2011 మధ్య కాలంలో 3.9 ఏళ్లు పెరిగినట్లు కూడా ఆ నివేదిక వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశంలో సగంమందిి బాత్‌రూమ్‌ సౌకర్యం లేకున్నప్పటికి, అంతకంటే ఎక్కువమందికి మొబైల్‌ఫోన్లు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల్లో భాగంగా సేకరించిన ఇళ్ళల్లో ప్రాథమిక సౌకర్యాలు, ఇళ్ళు, ఇతర ఆస్తుల వివరాలను మంగళవారం కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఆర్‌కె. సింగ్‌ విడుదలచేశారు. ఇందులో పలు ఆశ్చర్యకరమైన నిజాలు వెల్లడయ్యాయి. దేశంలోని 24.66 కోట్ల కుటుంబాల్లో 46.9 శాతం కుటుం బాలు మరుగుదొడ్ల సౌకర్యానికి నోచులేకపోతున్నారు. 49.8 మంది ప్రజలు ఆరుబయటే స్నానాదులు తదితర పనులు చేసుకుంటున్నారు. 3.2 శాతం ప్రజలు పబ్లిక్‌ టాయిలెట్లపై ఆధారపడుతున్నారు.

మరుగుదొడ్ల లేమిలో జార్ఖండ్‌ టాప్‌
జార్ఖండ్‌లో అత్యధికంగా 77 శాతం కుటుంబాలకు ఎటువంటి మరుగుదొడ్ల సదుపాయాలు లేవు. అదేవిధంగా ఒడిశాలో 76.6 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు లేమితో రెండవ స్థానంలో ఉంది. 75.8 శాతంతో బీహార్‌ ఆ తర్వాత స్థానంలో ఉంది. ఈ సౌకర్యాల మాట అటుంచుతే 63.2 శాతం కుటుంబాలు ఏదోఒక ఫోనును కలిగివుండగా, వారిలో 53.2 శాతం మంది మొబైల్‌ ఫోన్లను కలిగివున్నారు. రాష్ట్రాల వారీగా కుటుంబాలు కలిగివున్న టెలీఫోన్ల సాంద్రతను పరిశీలిస్తే క్షద్వీప్‌లో 93.6 శాతం కుటుంబాలు ఏదోఒక టెలీఫోన్‌ సెట్‌ను కలిగివున్నారు. కాగా ఢిల్లీ 90.8 శాతం కుటుంబాలు, చండీగఢ్‌ 89.2 శాతం కుటుంబాలతో తర్వాత స్థానాలను పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే 62.5 శాతం ప్రజలు ఇప్పటికి వంట ఇందనంకోసం కట్టెలపైై ఆదారపడుతున్నారు.

దేశంలో 44.8 శాతం ప్రజలు రవాణ సాధనంగా సైకిల్‌ను ఉపయోగిస్తున్నప్పటిి, టూ వీలర్‌ ఉన్న కుటుంబాలు 21 శాతం ఉన్నాయి. దేశంలో 4.7 శాతం ప్రజలు ఫోర్‌ వీలర్‌ను కలిగివున్నారు. దేశంలో కంప్యూటర్‌, ఇంటర్నెట్‌ సౌకర్యాలు కేవలం 3.1 శాతం మందికే అందుబాటులో ఉన్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా 32 శాతం కుటుంబాలకు శుద్ధిచేసిన తాగునీరు అందుబాటులో ఉండగా, 49 శాతం మంది వంటచెరుకును ఇందనంగా వాడుతున్నారు. 28.6 కుటుంబాలు ఎల్‌పీజీ లేదా పీఎన్‌జీని ఇందనంగా ఉపయోగిస్తున్నారు. మురుగునీటి సదుపాయం లేని కుటుంబాలు 48.9 శాతం ఉండగా, 33 శాతం కుటుంబాలకు ఒపెన్‌ మురుగునీటి వ్యవస్థను కలిగివున్నారు. అయితే 86.6 శాతం మంది భారతీయలు సొంత ఇళ్ళల్లో నివసిస్తుంటే వారిలో 36.6 శాతం ప్రజలు ఒక గదిలోనే నివసిస్తున్నారు. 31.7 శాతం ప్రజలు రెండు గదుల్లో నివసిస్తున్నారు. 14.5 శాతం ప్రజలు మూడు గదుల్లో నివసిస్తున్నారు.

వినోదాన్ని అందించే సాధనాల్లో టెలివిజన్‌దే ప్రథమ స్థానంగా తేలింది. 47.2 శాతం కుటుంబాలు టెలివిజన్‌ను కలిగివున్నారు. కాగా 19.9 శాతం కుటుంబాలు రేడియో లేదా ట్రాన్సిస్టర్‌ను కలిగి ఉన్నారు. ప్రజలు అనారోగ్యకరమైన ఈ అలవాట్లను పాటించటానికి ప్రధాన కారణాలుగా సాంప్రదాయ, తరతరాలనుంచి వస్తున్న సంస్కృతి, విద్యలేమి అని రిజిస్ట్రార్‌ జనరల్‌, సెన్సెస్‌ కమిషనర్‌ సి.చంద్రమౌళి విలేకరులతో అన్నారు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి